ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడిగా లచ్చయ్య ఎన్నిక

నవతెలంగాణ-గంగాధర: గంగాధర మండల ఎంపీటీసీల ఫోరం నూతన అధ్యక్షుడిగా కోలపురం లచ్చయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని 11 మంది ఎంపీటీసీలు సమావేశమై లచ్చయ్యను ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గతంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడిగా పని చేసిన అట్ల రాజిరెడ్డిని తప్పించి ఆ స్థానంలో కోలపురం లచ్చయ్యను ఎన్నుకున్నట్టు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కంకణాల రాజగోపాల్ రెడ్డి, మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా కోలపురం లచ్చయ్య మాట్లాడుతూ.. ఎంపీటీసీల సమస్యల సాధనకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఎంపీటీసీల సమస్యలపై ఐక్యంగా ముందుకు సాగుతామని వివరించారు.