– ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు తరంగ్, శ్రీకాంత్
– మణిపూర్ ఘటన నిందితులను శిక్షించాలి
– ప్రధానమంత్రి స్పందించకపోవడం సిగ్గుచేటు
– ఇబ్రహీంపట్నం టౌన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని ఎస్‌ఎఫ్‌ఐ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ ఘటన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రధాని స్పందించకపోవడం సరికాదన్నారు. మణిపూర్ ఘటన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో ర్యాలీ నిర్వహించి, సాగర్ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపూర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగించిన ఘటన దిగ్భాంతి కలిగిస్తుందన్నారు. మణిపూర్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళలను నగంగా ఊరేగిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అరచకాలను అక్కడి బీజేపీ ప్రభుత్వం అడ్డుకోలేకపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాంతిని నెలకొల్పాలని కోరారు. గత మూడు రోజులుగా పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు గొంతెత్తి అరుస్తున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వంలో గోవులకు ఉన్నంత రక్షణ మహిళలకు లేదన్నారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి మణిపూపూర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రిని ఈ ఘటనపై స్పందించమని అడగగా ఇలాంటి ఘటనలో 100 వరకు జరిగాయని చెప్పిన ముఖ్యమంత్రి అక్కడ ఏం చేస్తున్నట్టని ప్రశ్నించారు. తను ముఖ్యమంత్రి హౌదాకు అర్హత లేదన్నారు. వెంటనే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశాన్ని రక్షించే సైనికుడి కుటుంబానికే రక్షణ లేదని, ఇలాంటి దుర్మార్గమైన పాలన భారతదేశంలో కొనసాగుతుందన్నారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుడు కుటుంబానికి రక్షణ ఇవ్వలేని కేంద్ర ప్రభుత్వం వెంటనే గద్దేదిగాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు విప్లవ్ కుమార్, సుమంత్, మండల కమిటీ సభ్యులు లక్ష్మణ్, మధు, మనోహర్, సందీప్, శ్రీనాథ్, సోయబ్ పాల్గొన్నారు.