చివరి 45 నిమిషాలు..

చివరి 45 నిమిషాలు..దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన కొత్త సినిమా ‘మంగళ వారం’. పాయల్‌ రాజ్‌ పుత్‌, ‘రంగం’ ఫేమ్‌ అజ్మల్‌ అమీర్‌ జంటగా నటించారు. ముద్ర మీడియా వర్క్స్‌ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్‌ వర్మతో కలిసి అజరు భూపతి ‘ఎ’ క్రియేటివ్‌ వర్క్స్‌ సంస్థ చిత్రాన్ని నిర్మించింది. ఈనెల 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు అజరు భూపతి మీడియాతోహొమాట్లాడుతూ, ‘కాంటెంపరరీ కథతో క్యారెక్టర్‌ బేస్డ్‌ సినిమాగా కమర్షియల్‌ విలువలతోహొతీశా. నెక్స్ట్‌ లెవల్‌లో ఎండ్‌ అవుతుంది. ఇందులో పాయల్‌ క్యారెక్టర్‌ చూసి ప్రేక్షకులందరూ షాక్‌ అవుతారు. దాంతో పాటు భావోద్వేగాలు కూడా ఉంటాయి. జీవితంలో మళ్ళీ చేయలేనటువంటిహొపెర్ఫార్మన్స్‌ ఈ సినిమాలో చేసింది. ఇందులో జీరోహొఎక్స్‌పోజింగ్‌. థియేటర్ల నుంచి వచ్చే ప్రేక్షకులు ఏడుస్తూ వస్తారు. ఆమెను చూసి ఫీల్‌ అవుతారు.హొపాయల్‌, నందిత కాంబో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సినిమాలో ఒక్క ట్విస్ట్‌ కాదు, చాలా ఉన్నాయి. మాస్క్‌ వెనుక ఎవరు ఉన్నారోహొచూస్తే షాక్‌ అవుతారు. లాస్ట్‌ 45 నిమిషాలు నెక్స్ట్‌ లెవల్‌ ట్విస్టులు ఉంటాయి. ‘రంగస్థలం’ సౌండ్‌హొడిజైనర్‌హొఎంఆర్‌హొరాధాకష్ణ ఈ చిత్రానికి నెక్స్ట్‌ లెవల్‌లో చేశారు. సంగీత దర్శకుడు అజనీష్‌ సూపర్బ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ‘గణగణ మోగాలిరా’ పాటలోహొకొత్త సౌండింగ్‌ ఇచ్చారు. ఆరు రోజులు ఆ పాట తీశాం. 400 షాట్స్‌హొఉంటాయి. థియేటర్లలో పాట వచ్చినప్పుడు పూనకాలు వస్తాయి. నేపథ్య సంగీతం కూడా అద్భుథం. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌ నుంచి ప్రతి ఒక్కరు ప్రశంసించారు. అల్లు అర్జున్‌కి ఏడాదిన్నర క్రితమే కథ చెప్పాను. దీంతో ట్రైలర్‌ చూసిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో ఆయన ఊహించారు.హొ ఈ సినిమాకు పొడిగింపు అయితే ఉంటుంది. నాకు ప్రొడ్యూస్‌ చేయాలనిహొఎప్పటి నుంచో ఉంది. మా బ్రదర్‌ సురేష్‌ వర్మకి చెబితే స్వాతికి పరిచయం చేశారు. దీంతో మా కాంబోలో ఈ సినిమా కుదిరింది. నెక్ట్స్‌ సినిమాకి జోనర్‌ మార్చా. ఇంటెన్స్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేయబోతున్నా. హీరో ఇంకా ఎవరూ ఫిక్స్‌ కాలేదు’ అని తెలిపారు.