‘కాలింగ్ బెల్, రాక్షసి’ వంటి హర్రర్ మూవీస్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేసిన డైరెక్టర్ పన్నా రాయల్ నిర్మాతగా మారి డి.ఎం.యూనివర్సల్ స్టూడియోస్ పతాకంపై ‘ప్లాంట్ మ్యాన్’ అనే ఒక విభిన్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేటెస్ట్‌గా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
మంచి డైలాగ్స్, మంచి కామెడీ సిట్యుయేషన్స్‌తో ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్వించడమే ధ్యేయంగా ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.
డి.ఎం. యూనివర్సల్ స్టూడియోస్ సంస్థను స్థాపించి డైరెక్టర్ పన్నా రాయల్ కొత్తవారిని ప్రోత్సహించాలని, కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దాని ప్రకారమే ‘ప్లాంట్ మ్యాన్’ సినిమాను నిర్మిస్తూ కె.సంతోష్‌బాబును దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. పన్నా రాయల్ దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ చిత్రం గురించి నిర్మాత పన్నా రాయల్ మాట్లాడుతూ, ‘కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది. స్టార్టింగ్ నుంచి ఎండిరగ్ వరకు చక్కని కామెడీ ఉంటుంది. అంతేకాకుండా ఒక కొత్త ఎలిమెంట్ కూడా ఈ సినిమాలో ఉంది. అందుకే ఈ సినిమాకి ప్లాంట్ మ్యాన్ అనే టైటిల్ పెట్టాం. ఆ ఎలిమెంట్ ఆడియన్స్‌ని బాగా థ్రిల్ చేస్తుంది. డిసెంబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’ అని తెలిపారు.