పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

 Legislation should be given to SC classification in Parliament– ఎంఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు; సందె కార్తిక్‌ మాదిగ
నవతెలంగాణ-శంకర్‌పల్లి
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావే శాల్లోనే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని ఎంఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు సంధ్య కార్తీక్‌ మాదిగ అన్నారు. మంగళవారం శంకర్‌పల్లి అతిథి గృహంలో ఎంఎస్‌ఎఫ్‌ రంగారెడ్డి జిల్లా కో-కన్వీనర్‌ నాని భాను ప్రసాద్‌ ఆధ్వర్యంలో విశ్వరూప మహాసభను విజయ వంతం కోసం సమావేశం నిర్వహించారు. ఈ ప్రచా ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై, మాట్లాడుతూ 29 ఏండ్లుగా మహాజన మార్గదర్శి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం ఫలితంగా నాలుగేండ్ల వర్గీకరణ అమలై దాదాపు 25 వేల మందికి మాదిగ, ఉప కులాల నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరిగిందనీ, ఆత్మగౌరవం నిలుపుకునే విధంగా పోరా డుతున్నా మని అన్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో సుప్రీం కోర్టులో వర్గీకరణ ఆగిందని అదే సుప్రీం కోర్టు వర్గీకరణ చేయొచ్చని చెప్పి, 2020 ఆగస్టులో సూచన చేసిందన్నారు. అందుకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాల్లోనే వర్గీ కరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగా ఆగస్టు రెండో వారంలో మాదిగల విశ్వరూప మహా సభ హైదరాబాద్‌లో నిర్వహిస్తునట్టు తెలిపారు.ఈ సభకు మాదిగలు మహాజనులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌ పెంటనోల్ల నర్సింహా మాదిగ, కో-కన్వీనర్‌ కిరణ్‌ మాదిగ, ఎంఎస్‌ఎఫ్‌ రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి తోకలు చిరంజీవి మాదిగ, పరుశురాం, ఎమ్మార్పీఎస్‌ చేవెళ్ల నియోజవర్గ ఇన్‌చార్జి కాడిగల్ల ప్రవీణ్‌ కుమార్‌ మాదిగ, శివశంకర్‌, వెంకటేష్‌, సత్తీష్‌ మాదిగ, వంశీ, మనోజ్‌, శ్రీకాంత్‌, యాదగిరి, వినరు, లక్ష్మయ్య, పెంటయ్య, నర్సింలు, యువకులు పాల్గొన్నారు.