నవతెలంగాణ-శంకర్పల్లి
ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ చేవెళ్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేసారం శంకర్రావు మాదిగ, కాడిగళ్ల ప్రవీణ్ కుమార్ మాదిగ అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండల కేంద్రంలో ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం అంబేద్కర్ భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వారు పాల్గొని మాట్లాడారు. ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏబీసీడీ వర్గీకరణ సాధన కోసం ఆగస్టు మూడో వారంలో హైదరాబాద్‌లో జరగబోయే మాదిగల మరోవిశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి మాదిగ, మాదిగ ఉపకులాలు సిద్ధం కావాలని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి శివ శంకర్ మాదిగ, జిల్లా కో కన్వీనర్ భానుప్రసాద్, శ్రీనివాస్, ప్రవీణ్, మహేందర్, సీనియర్ నాయకులు లక్ష్మయ్య, నర్సింహ, రాంచందర్, పెంటయ్య, తిరుపతి, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.