సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించండి

నవతెలంగాణ-ఖమ్మం రూరల్‌
పాలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి తమ్మినేని వీరభద్రంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ(ఎం) ఖమ్మం రూరల్‌ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్‌ కోరారు. ఆదివారం పెద్దతండా జోన్‌ జనరల్‌ బాడీ సమావేశం నాయుడుపేటలో జోన్‌ కన్వీనర్‌ నందిగామ కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీన రూరల్‌ మండలం నుంచే నామినేషన్‌ కార్యక్రమం ఉంటుందని, ఈ నామినేషన్‌కు ఖమ్మం రూరల్‌ నుంచి వేలాదిగా సీపీఐ(ఎం) కార్యకర్తలు, అభ్యుదయవాదులు తరలివచ్చి నామినేషన్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియపరచాలని సూచించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) నాయకులు మొరబోయిన పుల్లయ్య, నందిగామ నాగరాజు, శ్రీనివాసరావు, ఆంటోనీ, వెంకన్న, సాయిబాబా, ఖాసిం, బాలరాజు, వీరబాబు, కౌసల్య, అచ్చమ్మ, యమున, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, హనుమంతరావు, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.