డ్రగ్స్‌ లేని సమాజాన్ని నిర్మిద్దాం

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా దినేష్‌ బౌద్‌ మాదకద్రవ్యాల దుర్వినియోగ సమస్యను ఎదుర్కునేందుకు చేతులు కలిపిన గ్రాన్యూల్స్‌ ఇండియా
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడి, డ్రగ్స్‌ లేని సున్నితమైన సమాజాన్ని నిర్మించాలని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా దినేష్‌ బౌద్‌ అన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌తో కలిసి శరవేగంగా అభివద్ధి చెందుతున్న ప్రముఖ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియా చేతులు కలిపిందని నిర్వాహకులు తెలిపారు. గ్రాన్యూల్స్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌ చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల దుర్వినియోగంపై ప్రజలలో అవగాహన పెంచేందుకు బుధవారం హైదరాబాద్‌లోని శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌లో పలు ఆసక్తికరమైన కార్యక్రమాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా, వాటిపై తీవ్రమైన సమస్యపై అవగాహన కల్పించేందుకు వీధి నాటకం ప్రదర్శించారు. అనంతరం ఆరోగ్య నిపుణులు మాట్లాడుతూ మానవ శరీరంపై మాదకద్రవ్యాల దుర్వినియోగంతో ఏర్పడే శారీరక, మానసిక ప్రభావాల గురించి వివరించారు. గ్రాన్యూల్స్‌ ఇండియా చైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, డాక్టర్‌ కృష్ణ చిగురుపాటి మాట్లాడుతూ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆసక్తిగా ఉందన్నారు. ‘బాధ్యతాయుతమైన ఒక ఫార్మాస్యూటికల్‌ కంపెనీగా, గ్రాన్యూల్స్‌ ఇండియా మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మాదకద్రవ్యాల దుర్వినియోగ సమస్యను ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతను గుర్తించిందన్నారు. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌తో భాగస్వామ్యం వహించడం ద్వారా, మాదకద్రవ్యాల దుర్వినియోగంతో కలిగే హాని కరమైన పరిణామాలపై, ప్రజల్లో అవగాహన కల్పించడానికి అపారమైన వనరులు ఉపయోగించుకోవాలని కోరారు. ‘మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతి రేకంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలబడి, అచంచలమైన అవగాహనతోనే మాదకద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మిం చేందుకు ఒక అద్భుతమైన సందేశాన్ని పంపు దామన్నారు. ఆరోగ్యకరమైన జీవితం, ఆరోగ్యకరమైన ఆలో చనల నుంచి పుడుతుందన్నారు.మాదకద్రవ్యాలకు సంబంధించిన అపో హలను తొలగించి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు పరిశోధన-ఆధారిత చికిత్స, సంరక్షణలో చురుకుగా పాల్గొనవలసిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నట్టు తెలిపారు.