– ఉన్నతాధికారులతో మంత్రి కొప్పుల సమీక్ష
– ఆవిర్భావం తర్వాత చేపట్టిన ప్రగతిపై చర్చ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నతాధికారులకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ, మైనార్టీ, వికాలాంగు శాఖ కార్పొరేషన్ ఉన్నతాధికారులు, చైర్మెన్లతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చేపట్టిన ప్రగతిపై చర్చించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజలకు వివరించాలని సూచించారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో లబ్దిదారులను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ, వికలాంగుల శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిన విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. దళిత బంధు, గురుకుల విద్యా విధానం, ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకాలపై డాక్యుమెంటరీ, ఫొటో ఎగ్జిబిషన్స్ నిర్వహించాలని అధికారులకు సూచిం చారు. ఫ్లెక్సీల ద్వారా ప్రచార కార్యక్రమాలు చేప డుతూ.. లబ్దిదారులతో ప్రదర్శనలు, కళాకారులతో నృత్యప్రదర్శనలు నిర్వహించాలన్నారు.