బొగ్గు పరిశ్రమ రక్షణకు పోరాడుదాం…

– సింగరేణి ప్రయివేటీకరణ కాకుండా కాపాడుకుందాం
– సీఐటీయూ రాష్ట్ర మహాసభలో పలు తీర్మానాలు
నవతెలంగాణ-కొత్తగూడెం
బొగ్గు పరిశ్రమ రక్షణకు కలిసి పోరాడుదామని, సింగరేణి సంస్థను ప్రయివేటీకరణ కాకుండా కాపాడుకుందామని సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటియూ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.రాజిరెడ్డి, మందా నర్సింహారావు అన్నారు. సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ) 16వ రాష్ట్ర మహాసభలు మే 21, 22 తేదీల్లో గోదావరిఖని ఆర్‌జి-1లో జరిగాయి. ఈ మహాసభలో నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ పలు తీర్మాణాలు చేసిందని వారు మంగళవారం తెలిపారు. ఈ మహాసభలు చేసిన ముఖ్యమైన తీర్మానాలు.
బొగ్గు పరిశ్రమ రక్షణ, సింగరేణి ప్రయివేటీకరణ కాకుండా కాపాడుకోవాలని, సింగరేణిలో బొగ్గు తీసే పనులు సింగరేణి కార్మికులతోనే చేయించాలని, సింగరేణికి రావలసిన రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు వెంటనే చెల్లించాలని, కార్మికుల సొంత ఇంటి పథకం నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. జేబీసీసీలో అగ్రిమెంట్‌ అయి అమలు కాని అంశాలు ప్రస్తామించారు. పెర్క్స్‌పై ఇన్కమ్‌ టాక్స్‌, ప్రమోషన్లకి ఇంక్యుమెంట్లు, స్టేటస్‌ స్కీములు అమలు తదితర అంశాలు చర్చించారని తెలిపారు. సింగరేణిలో అగ్రిమెంటే అమలు గాని అంశాలు వాటిని అమలు చేయాలన్నారు. ముఖ్యంగా ఉద్యోగం పొందిన రోజుల్లో ఉన్న పేర్ల మార్పిడి, డిపెండెంట్ల వయస్సు 40 సంవత్సరాలకు పెంపు, అండర్‌ గ్రౌండ్‌లో పనిచేసే సర్ఫేస్‌ కు వచ్చిన మైనింగ్‌, టెక్నికల్‌, ఈపి గ్రేడ్స్‌, కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని సూచించారు. హాస్పిటల్‌ సౌకర్యం మెరుగుపరచాలని, వైద్య పరికరాలు మెరుగుపరచాలని నైపుణ్యం గల డాక్టర్లను నియమించాలని, కాంట్రాక్ట్‌ కార్మికులకు ఐ పవర్‌ కమిటీ వేతనాలు, రాష్ట్ర ప్రభుత్వ జీవో నెంబర్‌ 22 అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు వైద్య సౌకర్యం కల్పించాలని, అగ్రిమెంట్‌ అయిన దానిని అమలు తోపాటు బోనస్‌ పెరుగుదల సౌకర్యాల మెరుగుపరచవులని అంశాలను తీర్మాణాలో పొందు పరిచారని తెలిపారు.
– సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఎన్నిక
– అధ్యక్షులుగా టి.రాజిరెడ్డి
– కార్యదర్శిగా మందా నర్సింహారావు
– కొత్తగూడెం నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా విజయగిరి శ్రీనివాస్‌
సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ సీఐటీయూ 16వ రాష్ట్ర మహాసభలు మే 21, 22 తేదీల్లో గోదావరిఖని ఆర్‌జి-1లో నిర్వహించారు. ఈ మహాసభలో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ మూడు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. గౌరవాధ్యక్షులు కామ్రేడ్‌ పి. రాజారావు, రాష్ట్ర అధ్యక్షులుగా టి.రాజారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మంద నరసింహారావు లను ఎన్నుకున్నారు. ఉప ప్రధాన కార్యదర్శి ఎస్‌ .నాగరాజు, గోపాల్‌, కోశాధికారిగా వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మెండే శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులుగా పి.మధు, విజయగిరి శ్రీనివాస్‌, డి. కొమురయ్య, వి.వెంకటరత్నం, కంపెటి రాజయ్యలను ఎన్నుకున్నారు. కార్యదర్శిలుగా ఎస్‌.వెంకట స్వామి, ఈ కుమార్‌, మేదర్‌ సారయ్య, ఆసరి మహేష్‌, కార్యదర్శి ఉపాధ్యక్షులు విజరు కుమార్‌ రెడ్డి, కార్యదర్శి శ్వేత, ఆర్జీ-2, శ్రీరాంపూర్‌ కో- ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్నారని తెలిపారు.
రాష్ట్ర కమిటీ సభ్యులు
రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఎలగొండ రఘు (కొత్తగూడెం), సూరం అయిలయ్య (కొత్తగూడెం), ఈ.శ్రీరామ్మూర్తి (కొత్తగూడెం), బి.ప్రకాష్‌ (కొత్తగూడెం), నెల్లూరు నాగేశ్వరరావు (మణుగూరు), టీవీ.ఎంవి. ప్రసాద్‌ (మణుగూరు), ఎన్‌.విల్సన్‌ రాజు (మణుగూరు) ఎన్‌.ఈశ్వరరావు (మణుగూరు), ఎం. లక్ష్మణరావు (మణుగూరు), ఎండి.అబ్బాస్‌ (ఇల్లందు), తోకరి శ్రీనివాస్‌ (భూపాలపల్లి) కె.ఏసుబాబు (భూపాలపల్లి) కంచు రామ్‌ (భూపాలపల్లి) ఈ.ఉమా (భూపాలపల్లి) కె.వేణుగోపాల్‌ (ఆర్జీ- 3) ఎం.వెంకటేశ్వర్లు అర్జీ -3, జి.గోపాల్‌ ఆర్‌జి-3, డి.కొమురయ్య (ఆర్‌ జి-3) టి. నరహరి రావు (ఆర్జీ- 3), డి.సురేష్‌ (ఆర్‌జి-1), సిహెచ్‌. వేణుగోపాల్‌ రెడ్డి (ఆర్‌ జీ-1), ఎస్‌కె.గౌస్‌ (ఆర్‌జీ-1), పి.శ్రీవాసరావు (ఆర్జీ-1), ఆరేపల్లి రాజమౌళి (ఆర్‌జీ -1), అన్నం శ్రీనివాస్‌ (ఆర్‌జీ-1), యన్‌.శ్యామల, (ఆర్‌జీ,-1), రామగిరి రామస్వామి (మందమర్రి), జె. వెంకటేష్‌ (మందమర్రి), ఎండి ఆరిఫ్‌ (మందమర్రి), శ్రీరాంపూర్‌ కో-ఆప్షన్‌-4, ఆర్జీ-2 కో- ఆప్షన్‌ రెండు ఎన్నుకున్నారు.