జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం సమిష్టిగా పోరాడుదాం

– దశలవారి ఆందోళనలకు జర్నలిస్టులు సిద్ధం కావాలి
– రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కూనంనేని
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఏండ్లు గడుస్తున్నా జర్నలిస్టులకు నీడకల్పించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేసి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం కొత్తగూడెం శేషగిరిభవన్‌లో మంగళవారం జరిగిన వామ పక్షాలు, విపక్ష పార్టీలు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా, సామాజిక సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్‌ పాషా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రతీ వేదికపై జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని హీమీ గుప్పిస్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని, ఇటీవల జిల్లా పర్యటన సందర్భంగా ఇక్కడి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా అతీగతి లేకుండా పోయిందన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, న్యూడెమోక్రసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవునూరి మధు మాట్లాడుతూ జర్నలిస్టుల పక్షాన ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసీఆర్‌ను నిలదీసే దమ్ము దైర్యం లేకపోవడం వల్లే సమస్యకు పరిష్కారం లభించడం లేదన్నారు. మరోసారి సమావేశమై పోరాట కార్యాచరణను రూపొందించి ప్రత్యక్ష ఆందోలనలకు పూనుకుంటామన్నారు. ఈ సమావే శంలో సిపిఐ, ప్రజా సంఘాల జిల్లా నాయకులు బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారా యణ, వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్‌, గుత్తుల సత్యనారాయణ, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, లిక్కి బాలరాజు, నూనావత్‌ గోవిందు, ఎస్‌కె. ఫహీమ్‌, కె.తర్నకుమారి, గోనె మణి, బోయిన విజరు కుమార్‌, మాచర్ల శ్రీనివాస్‌, పి. సత్యనా రాయణచారి, గొనె సురేష్‌, షమీమ్‌, విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు ఉదరు కుమార్‌, జి.వెంకటేశ్వర్లు సూరి, శివకుమారస్వామి, కుమార్‌, దశరద్‌, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.