గ్రామ కమిటీలతో పార్టీని బలోపేతం చేద్దాం

– బ్లాక్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు బాల్‌ రాజ్‌ గౌడ్‌
నవతెలంగాణ-షాద్‌ నగర్‌
గ్రామ కమిటీలతో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేద్దామని, మండలంలో ప్రతి గ్రామంలో అన్ని కమిటీలను పూర్తి చేస్తామని బ్లాక్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు బాల్‌ రాజ్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని చించొడ్‌ గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీ సంఘం మండల అధ్యక్షులు బసప్ప, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు నాగి సాయిలు, ఎస్టీ సెల్‌ అధ్యక్షులు సక్రు నాయక్‌ ఆధ్వర్యంలో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీ సెల్‌ గ్రామ కమిటీ అధ్యక్షులుగా మిద్దె యాదయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బండల నరేష్‌, ఉపాధ్యక్షులుగా కోట శ్రీకాంత్‌ ప్రధాన కార్యదర్శిగా చీర మల్లేష్‌, కార్యదర్శులుగా చెక్కల శివ, బండాల లింగం గ్రామ ఎస్సీ కమిటీ అధ్యక్షులుగా పుడుగుర్తి గోపాల్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కోట రిక్కీ కృష్ణయ్య, ఉపాధ్యక్షులు గా మ్యారం శివ, అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా శివమల్ల శ్రీశైలం, కోశాధికారిగా నీరటి బాలరాజ్‌, ఎస్టీ సెల్‌ గ్రామ కమిటీ అధ్యక్షులుగా హర్యానాయక్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉపాధ్యక్షులుగా రాజు నాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఐఎన్టియుసి కార్యదర్శి రఘు, తాలూకా ఎస్టీ సెల్‌ అధ్యక్షులు శీను నాయక్‌, చించోడు గ్రామ కమిటీ అధ్యక్షుడు అస్మత్‌ బాబా, సీనియర్‌ నాయకుడు ఎల్లప్ప, రుస్తుం పెంటయ్య, రాజు, హరికృష్ణ, అనంతం, చీర అంజయ్య, శివ ఎక్స్‌ ఎంపిటిసి, దాస్య నాయక్‌, లక్ష్మణ్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.