
అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మల్లయోధులకు మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వాజిల్లా కార్యదర్శి సుజాత అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాముడి పేరుతో అధికారంలోకి వచ్చి రావణా పాలన కొనసాగిస్తున్నరు అన్నారు. తమ న్యాయమైన పోరాటాన్ని కొనసాగిస్తున్న మల్లయోధులపై అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారే తప్ప బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ ఎంపీ పదవి నుంచి తొలగించి అరెస్టు చెయ్యడం లేదని అన్నారు. మల్ల యోధులకు న్యాయం చేయాలని ఐద్వా డిమాండ్ చేస్తుంది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అనిత. జిల్లా ఉపాధ్యక్షులు కటారి లావణ్య, బొప్పిది అనసూజ, నాయకులు కళావతి తదితరులు పాల్గొన్నారు.