తాటతీస్తాం

నేనూ ..మనిషినే
నాకూ… మానం ఉంది
మనిషిని ప్రేమించే గుణం ఉంది

బుద్ధి జీవులు
బుద్ధిహీనులు అవుతున్నారు

గడ్డి మేసే జంతు జాలాల కు
శరీర ధర్మం తెలుసు
ఆవు మానాన్ని కాపాడుటకు
తోక ఉంది
కుక్క నక్క జంతువులకు
పక్షులకు శరీర ధర్మం తెలుసు

బుద్ధి ఎరిగిన మానవజాతి
ఒళ్ళు బలిసి కొవ్వెక్కి తిన్నది అరగక

దళిత గిరిజన మహిళలపై
అత్యాచారాలు లైంగిక దాడులు చేస్తున్నారు

అధికార మదంతో రాజకీయ అండతో
మహిళలపై దాడులు చేస్తున్నారు

ఖబర్దార్‌ తిరగబడతాం
వీరనారి ఝాన్సీ రుద్రమదేవి
చాకలి ఐలమ్మల
రోకలి బండలతో ప్రతిఘటిస్తాం

తాటతీస్తాం చూస్తూ ఊరుకోం
అనుచబడుతున్న వర్గాలు ఏకమై ఏలుకుంటాం
వర్ధిల్లాలి అనుచబడుతున్న వర్గాలు
వర్ధిల్లాలి వర్ధిల్లాలి
– ఆర్కల రాజేష్‌, 9177909700