– మండల అధ్యక్షులు గూడ వీరేశం
నవతెలంగాణ-కేశంపేట
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని మండల అధ్యక్షులు గూడ వీరేశం పిలుపునిచ్చారు. ఆదివారం కేశంపేట మండలం దత్తయపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడ వీరేశం ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బాల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా నర్సింహ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వీరేశం మాట్లాడుతూ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక ప్రజలు దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. పేదోడి సొంతింటి కల నెరబరబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీశ్వర్, నాయకులు కరుణాకర్ రెడ్డి, గోపాల్ ముదిరాజ్, రాంరెడ్డి, బాస్కర్, రమేష్, రావుల పెంటయ్య ముదిరాజ్, రాములు, అర్జున్, లక్ష్మన్, రాజెందర్ రెడ్డి, లింగంయాదవ్, అంజయ్య, యాదయ్య, ప్రవీణ్‌లతోపాటు తదితరులు పాల్గొన్నారు.