గ్రంథాలయాలలో హైబ్రిడ్ గ్రంథాలయాలు అవసరం…

Webinar
Webinar

– జాతీయ వేబీనార్ లో ఉపకులపతి ఆచార్య బి.జె రావు…

నవతెలంగాణ – ధూల్ పేట్ 
గ్రంథాలయాలలో హైబ్రిడ్ గ్రంథాలయాలు అవసరమని హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బి.జె రావు అన్నారు. చెంజీంగ్ రోల్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీ ఇన్ టెక్నోలజికల్ ఎన్విరాన్మెంట్ అనే అంశంపై గ్రంథాలయ శాస్త్ర విభాగం ప్రభుత్వ సిటీ కళాశాల, తెలంగాణ గ్రంధాలయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఒకరోజు జాతీయ వేబినార్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో డీప్ రీడింగ్, డీప్ ఇండెంట్, టెక్నాలజీ పాటకులను గ్రంధాలయాలను ప్రభావితం చేస్తుందన్నారు. ప్రస్తుతము పౌర గ్రంధాలయాలలో అకడమిక్ గ్రంథాలయాలలో హైబ్రిడ్ గ్రంథాలయాలు (ఫిజికల్, డిజిటల్) అవసరమని విద్యార్థులను, ఉపాధ్యాయులను, పుస్తకాలను చదివేటందుకు ప్రేరేపించాలని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉపప్రచార్యులు డాక్టర్ విప్లవ దత్ శుక్ల  ప్రసంగిస్తూ.. ప్రస్తుత కాలంలో పౌర గ్రంథాలయాల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ మందపాటి శేషగిరిరావు ప్రసంగిస్తూ.. ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజా ప్రతినిధుల సహకారంతో పుస్తకాలు కొంటున్నామన్నారు. పౌర గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తామని తెలిపారు. తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ ఆయాచితం శ్రీధర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో జరిగిన గ్రంథాలయాల అభివృద్ధిని ఏకరవుపెడుతూ, ప్రజా ప్రతినిధుల సహకారంతో గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మండలాల నుండి కేంద్ర గ్రంథాలయాల స్థాయికి వరకు నెట్వర్క్ ను ఏర్పాటు చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా మేఘ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. తెలంగాణ గ్రంథాలయ సంఘం అధ్యక్షులు ఆచార్య లక్ష్మణరావు  మాట్లాడుతూ.. దేశంలో అనేక డాటా బేస్లు ఉన్నాయని, ఉచిత వనరులు ఉన్నాయన్నారు. వీటన్నిటినీ పౌర గ్రంథాలయాలలోని పాఠకులు అందిపుచ్చుకోవాలన్నారు. తెలంగాణ గ్రంథాలయ సంఘం ఉపాధ్యక్షులు ఆచార్య సుదర్శన్ రావు మాట్లాడుతూ.. పౌర గ్రంథాలయాలను మల్టీపర్పస్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్నారు. వాటికి ఆర్థిక వనరులు కల్పించాలని గ్రంథాలయాల్లో పనిచేసే గ్రంథ పాలకులకు నిత్యం ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి సందాన కర్తగా డాక్టర్ రవి కుమార్ చేగోని గ్రంథపాలకులు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె భాస్కర్, నీరజ, రత్నపభాకర్ అవధానం సుజాత, తిరుపతి, అనిల్ బుసి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గ్రంథ పాలకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రంథ పాలకులు, ప్రైవేటు కళాశాలల గ్రంథపాలకులు, గ్రంథాలయ శాస్త్ర విద్యార్థులు దేశవ్యాప్తంగా 250 గ్రంథాలయ శాస్త్రం నిపుణులు పాల్గొన్నారు.