జీవనశైలి, ఒత్తిడే ‘స్ట్రోక్‌’కు మూలం

– అపోలో హాస్పిటల్స్‌ డాక్టర్‌ రాజేష్‌ రెడ్డి
నవతెలంగాణ-జూబ్లీహిల్స్‌
జీవనశైలి, ఒత్తిడి మూలంగా యువతలో స్ట్రోక్‌ ప్రమాదం అధికంగా ఉందని అపోలో ఆస్పత్రి(జూబ్లీహిల్స్‌) న్యూ రాలజిస్ట్‌ డాక్టర్‌ సీ రాజేష్‌ రెడ్డి తెలిపారు. ప్రపంచ స్ట్రోక్‌ డే అక్టోబర్‌ 29 పురస్కరించుకొని ఒక ప్రకటన విడుదల చేశారు. మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా అడ్డుకోవడం వల్ల స్ట్రోక్‌ వస్తోందన్నారు. దీనినే న్యూరోలాజికల్‌ లోటుగా చెప్పొచ్చన్నారు. ఇస్కీమిక్‌ స్ట్రోక్‌ అని పిలుస్తారన్నారు. రక్తనాళాలు చీలిపోవడం వల్ల మెదడులోకి రక్తం లీకేజ్‌ అవుతుందన్నారు. దీనిని హెమరేజిక్‌ స్ట్రోక్‌ అంటారు. ఇస్కీమిక్‌ స్ట్రోక్‌ సర్వసాధారణమని, ఈ స్ట్రోక్‌లు 80-85 శాతం ఉండగా, మిగిలినవన్నీ హెమరేజిక్‌ స్ట్రోక్‌లు అన్నారు. భారతదేశంలో ‘స్ట్రోక్‌’ అనేది వైకల్యానికి ప్రధాన కారణ మని, మరణాలకు రెండో సాధారణ కారణమని పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతి 40 సెకన్లకు కనీసం ఒక స్ట్రోక్‌, ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మరణం సంభవిస్తుందన్నారు. స్ట్రోక్‌ ప్రారంభమైన తర్వాత ప్రతి నిమిషానికి 1.9 మిలియన్ల మెదడు కణాలు చనిపోతాయన్నారు. చికిత్స జరగని ప్రతి గంటలో మెదడు దాదాపు 3.6 సంవత్సరాల సాధారణ వద్ధాప్యంలో ఉన్నంత న్యూరాన్‌లను కోల్పోతుందని తెలిపారు. ఎవరికైనా స్ట్రోక్‌ను సూచించే లక్షణాలు ఉంటే, మెదడును రక్షించడానికి వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని తెలిపారు. కొంతమంది రోగులు స్ట్రోక్‌ లక్షణాలను కలిగి ఉండవచ్చు, కానీ టీఐఏ (ట్రాన్సియెంట్‌ ఇస్కీమిక్‌ అటాక్‌) ప్రారంభమైన కొన్ని గంటల్లోనే పూర్తిగా మెరుగుపడవచ్చని తెలిపారు. టీఐఏ ఉన్న రోగులను మెడికల్‌ ఎమర్జెన్సీగా పరిగణించాలని, పెద్ద స్ట్రోక్‌ నివారణకు వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించాలని తెలిపారు. స్టోక్‌కి ముఖ్యంగా ఇస్కీమిక్‌ స్ట్రోక్‌కి సాధారణ కారణాలు హైపర్‌టెన్షన్‌ (అధిక రక్తపోటు), డయాబెటిస్‌ మెల్లిటస్‌, అధిక రక్త కొలెస్ట్రాల్‌, సిగరెట్‌ తాగడం, గుండె జబ్బులు, అధికంగా మద్యం తీసుకోవడం, జీవనశైలి, అధిక ఒత్తిడి కారణమన్నారు. ప్రపంచ స్ట్రోక్‌ డే ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 29న జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం థీమ్‌ ‘మేమంతా కలిసే ఉన్నాం, ఇది స్ట్రోక్‌ కంటే గొప్పది’ అని అన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలితో స్ట్రోక్‌ ను అధిగమించవచ్చన్నారు. ఫైబర్‌, ప్రొటీన్లు, పండ్లు, సలాడ్‌లు, సాధారణ కార్బోహైడ్రేట్‌లు, కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలన్నారు. వారంలో ఎక్కువ రోజులు నడక, జాగింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ వంటి ఏరోబిక్‌ వ్యాయామాలు కనీసం 30-40 నిమిషాలు.చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించవచ్చన్నారు. హెచ్టీఎన్‌, డీఎం ఉన్న వ్యక్తులు క్రమం తప్పకుండా మందులు వాడాలన్నారు. ధూమపానాన్ని పూర్తిగా మానేయాలని తెలిపారు. మద్యపానాన్ని మానేయడం లేదా మితంగా తీసుకోవాలని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-07 06:23):

how to lower your blood sugar in minutes IzO | gox labs utk blood sugar watch | does O9a spicy food lower blood sugar | 1Np how to raise blood sugar in dogs | DE7 low blood sugar and muscle spasms | bIP does l theanine lower blood sugar | new blood sugar test bfB machine without pricking | normal blood sugar v4h before breakfast uk | can low blood JWd sugar increase bp | how do you feel when blood 7RB sugar is low | blood sugar monitor NAb armband | random blood sugar 75 mg Quk | dr axe rPI how long after pancreatitisdoes blood sugar normalize | blood sugar hxE monitor smartwatch | low ugp blood sugar tiredness | blood sugar 1Pd level 131 means | qi2 how do i make my blood sugar go down | what type of magnesium lowers PEN blood sugar | normal blood sugar levels ezQ chart nz | blood sugar level 220 after Rx6 meal | can diet oih coke rase your blood sugar | xmw benadryl low blood sugar | blood sugar riL 187 a1c | non diabetic blood sugar 200 xYP | does maple syrup affect blood AEf sugar levels | electronic u5g blood sugar monitor | does high blood pressure medicine make your blood mOs sugar high | pre diabetes rOY postprandial blood sugar levels | how to control unY blood sugar level in body | diabetic low BA8 blood sugar after eating | blood sugar after a meal Asq | can vomiting Dsq increase blood sugar | what should a person blood ScX sugar be after a meal | how rare 7We are seizures with low blood sugar | 59y is 118 normal for blood sugar | beetroot IXq juice increase blood sugar | normal range of blood sugar level GN7 during pregnancy | KNe can hydrocodone effect blood sugar | best pNE digital blood sugar meter | walking increases ocI blood sugar | in normal people what happens to excess blood kTg sugar | infection raise blood sugar c9C | can lisinopril raise blood sugar FFo | vFq smart blood sugar free pdf download | controlling 2LM blood sugar during exercise | how do i rm4 help a diabetic having high blood sugar | is berberine good for blood sugar 6Aq | what is your blood sugar supposed to read URS | does PNR vitamin e increase blood sugar | how to control blood sugar in Sdu fasting