మెరుపు మీసొంతం

Lightning is yoursముఖం మెరుపులీనాలని అందరికీ ఉంటుంది. ఇందుకు ఏవేవో క్రీములని, ఫౌండేషన్స్‌ అని చాలా ఖర్చు చేస్తుంటారు. అలా కాకుండా, సింపుల్‌గా, నాచురల్‌గా ముఖం కాంతులీనాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే సరి..

బియ్యం పిండి, మిల్క్‌ క్రీమ్‌ రెండూ ముఖం మెరిసిపోవడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి మంచి ఫేస్‌ స్క్రబ్‌లా కూడా ఉపయోగపడతాయి. ఒక టీస్పూన్‌ బియ్యం పిండిని తీసుకుని కాస్తంత మిల్క్‌ క్రీమ్‌ను కలపండి. ఆ తర్వాత ముఖంపై, మెడపై ఈ మిశ్రమంతో సర్క్యూలర్‌ మోషన్‌లో మసాజ్‌ చేయండి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
చిటికెడు పసుపును, శనగపిండిని కలిపి చిక్కగా పేస్ట్‌లా చేసుకుని, ముఖంపై మసాజ్‌ చేసుకోవాలి. ముఖ్యంగా మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ప్రాంతంలో కచ్చితంగా మసాజ్‌ చేయాలి. ఇది ముఖంపై నుంచి అదనపు నూనెను గ్రహిస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, క్లీన్‌గా ఉంచుతుంది.
మిల్క్‌ క్రీమ్‌ను కాస్తంత తేనెతో కలపండి. ముఖంపై అప్లై చేసుకోండి. కొద్ది సేపు ఆరనివ్వండి. కొన్ని నిమిషాల తరువాత నీటితో కడిగేయండి. బ్యూటీపార్లర్‌కు వెళ్ళినంత మెరుపు మీ ముఖంపై గమనిస్తారు.