సాహితీ వార్తలు

యుద్ధం-శాంతి’ కవితలకు ఆహ్వానం
విమలసాహితీ సమితి, అభ్యుదయ రచయితల సంఘం, మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ, సజన కళల వేదికల సంయుక్త నిర్వహణలో ‘యుద్ధం శాంతి’ అంశంపై కవితా సంకలనం తీసుకువస్తుంది. అందుకోసం కవితలను ఆహ్వానిస్తున్నారు. కవితలు 30 లైన్లు లోపు యూనికోడ్లో టైపు చేసి పంపాలి. ఒక కవి ఒక కవిత మాత్రమే పంపాలి. పత్రికలలో ప్రచురితమైన కవితలు కూడా పంపవచ్చు. వీలువెంబడి కవితలు ఆంగ్లంలోకి అనువదించబడతాయి. కమిటీ ఎంపిక చేసిన ఉత్తమ కవితలకు బహుమతులు వుంటాయి. కవితా సంకలనం ఆవిష్కరణ సభలో కవి సమ్మేళనం, కవి సత్కారం వుంటుంది. కవితలతో పాటు హామీపత్రం తప్పకుండా జత చేయాలి. ఆసక్తిగల కవులు తమ కవితల్ని yuddhamshanti@gmail.com నవంబర్‌ 30వ తేదీలోగా పంపాలి. పూర్తి వివరాలకు 94904 69606, 93982 54545, 9381522247 నెంబర్లలో సంప్రదించవచ్చు.
అక్షరాలతోవ కథల పోటీ 2024
అక్షరాల తోవ 6 వార్షికోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి కథల పోటీని నిర్వహిస్తోంది. మూడు ఉత్తమ కథలకు, ఒక్కో కథకు 2000 రూపాలయ నగదు, అక్షరాల తోవ పురస్కారం అందజేస్తారు. కథలు నవ్యత, సృజనాత్మక, సామాజిక స్పృహ కలిగి మనసును తాకేలా వుండాలి. కథలను డి.టి.పి. చేసి ఎ4 సైజులో 5 పేజీలు పంపించాలి. ఒక రచయిత ఒక్క కథ మాత్రమే పంపించాలి. హామీ పత్రం జతచేసి 30 నవంబర్‌ 2023వ తేదీ లోపు రాచమళ్ళ ఉపేందర్‌, స్టార్‌ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌, శాంతిలాడ్జి ఎదురుగా, స్టేషన్‌రోడ్‌, ఖమ్మం – 507001 చిరునామాకు పోస్ట్‌/ కొరియర్‌ ద్వారా మాత్రమే పంపించాలి.
సెల్‌ : 9849277968.