మాతృభాష ఉనికి – కర్తవ్యాలపై సదస్సు
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ‘2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు – 2024’ జనవరి 5,6,7 తేదీలలో, రాజమహేంద్రవరంలో జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల సౌజన్యంతో ‘మాతృభాష తెలుగు – ఉనికి, కర్తవ్యాలు’ అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక వ్యాస సంకలనం ముద్రిస్తున్నట్లు, దీనిలో తెలుగు పరిశోధకులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు భాషాభిమానులు, మాతృభాష పరిరక్షణకు కృషి చేస్తున్న వివిధ సేవా సంస్థల నుండి వ్యాసాలను ఆహ్వానిస్తున్నారు. రచనలు పంపేవారు తమ అంశాన్ని, పేరును, విద్య, ఉద్యోగ వివరాలను నవంబర్ 15వ తేదీలోపు aరజూజూతీaఝస2స23ఏస్త్రఎaఱశ్రీ.షశీఎ ఈమెయిల్ కు పంపి నమోదు చేసుకోవలెను. అందిన రచనలలో ఉత్తమమైన మూడు రచనలకు బహుమతులు ఉంటాయి. ఈ వ్యాస సంకలనం ×ూదీచీ ఆమోదంతో ముద్రించబడుతుంది. వ్యాసాల రచనకు పంపవలసిన అంశాలు : మాతృభాష పరిరక్షణకు భాషోపాధ్యాయుల కర్తవ్యం. నైతిక విలువల పరిరక్షణ. సాంకేతిక పరిజ్ఞానంతో మాతృభాషాభివృద్ధి. మారుతున్న కాలానికి అనుగుణంగా మాతృభాష బోధనలో తీసుకురావలసిన మార్పులు. సాహిత్యం – మాతృభాషల తులనాత్మకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బాలలకు తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చేపట్టాల్సిన కర్తవ్యం. మాతృభాష పరిరక్షణకు వివిధ సామాజిక సేవా సంస్థలు ఏ విధంగా సహకరించవచ్చు. రచనల నిడివి 500 పదాలు మించరాదు. పాస్ పోర్ట్ సైజు ఫొటోతో సహా డిసెంబర్ 1 వ తేదీలోపు నమోదు చేసుకోవాలి. పూర్తి రచనలు డిసెంబర్ 10 వ తేదీ లోపు పంపించాలి. వివరాలకు : ర్యాలి ప్రసాద్ – 9494553425
పుస్తకావిష్కరణ
పొత్తూరి అన్నపూర్ణమ్మ శతజయంతి మహోత్సవాలను పురస్కరించుకుని డా|| పొత్తూరి వెంకటేశ్వరరావు ‘అమ్మ అన్నపూర్ణమ్మ’ (సంక్షిప్త జీవిత చరిత్ర) పుస్తకాల ఆవిష్కరణ డిసెంబర్ 3వ తేదీ గుంటూరు సాహితీకిరణం కార్యాలయంలో ఆవిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎ.ఎల్.కిస్మత్ కుమార్, బైస దేవదాసు,గుదిబండి వెంకటరెడ్డి, విడదల సాంబశివరావు, కొసరాజు సమ్రాజ్యం, పొత్తూరి సుబ్బారావు, పెద్దూరి వెంకటదాసు, జానీ బాషా, తూమూలూరి రాజేంద్రప్రసాద్, వల్లూరి శివకోటేశ్వరరాజు, పి.వి.ఎల్.నరసింహారావు, పొత్తూరి ప్రేమగోపాలకృష్ణ తదితరులు పాల్గొంటారు. మాతృదేవోభవ అంశంపై నిర్వహించే కవి సమ్మేళనంలో పలువురు కవులు, కవయిత్రులు పాల్గొంటారు.