మహాకవి శ్రీశ్రీ స్మారక కథల పోటీ

సింహ ప్రసాద్‌ సాహిత్య సమితి ఆధ్వర్యంలో తీసుకువస్తున్న సంకలనం ‘మా కథలు -2022’. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ స్మారకంగా కథల పోటీని నిర్వహిస్తున్నారు. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ అనే అంశాల మీద కథలు రాయవచ్చు. ఒక వ్యక్తి మూడింటిమీద కథలు రాసి పంపవచ్చు. ఎంపికైన కథకు రూ.2000/- బహుమతి ఉంటుంది. 50 ఏళ్లు దాటని వారికే ఈ పోటీ పరిమితం. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 20 లోగా సింహప్రసాద్‌ సాహిత్య సమితి, 401, మయూరి ఎస్టేట్స్‌, ఎం.ఐ.జి -2-650, కే.పి. హెచ్‌. బి. కాలనీ, హైదరాబాద్‌ – 500 072 చిరునామాకు పంపవచ్చు. అక్టోబర్‌ 14న హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో నిర్వహించే కార్యక్రమంలో బహుమతి ప్రదానం ఉంటుంది. వివరాలకు 9849061668 నంబరు నందు సంప్రదించవచ్చు.

Spread the love