అక్షర సేద్యం కవితల పోటీ ఫలితాలు

అక్షర సేద్యం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కవితల పోటీల ఫలితాలు వెలువరించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు మనిషి జాడ – పెనుగొండ బసవేశ్వర్‌, పశువు – చిందం రమేష్‌, కొత్తగా చిగురించాలి – డా|| మల్లిపూడి రవిచంద్రలతో పాటు పని దేవత – చింతా అప్పలనాయుడు, ఖాళీ మనుషులు – కళా గోపాల్‌, నన్ను నన్నులా – డి. నాగజ్యోతి శేఖర్‌, ఎన్నాళ్ళుంటారు రోడ్ల మీద – డా|| జడా సుబ్బారావు, అవిభాజ్య దుఃఖం – లేదాళ్ళ రాజేశ్వరరావులు ఐదు ప్రత్యేక బహుమతులకు ఎంపికయ్యారు. పుస్తకావిష్కరణ రోజున బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. వివరాలకు 9701933704 నంబరు నందు సంప్రదించవచ్చు.

Spread the love