‘నెవర్ ఎండ్’ పుస్తకావిష్కణ
తెలంగాణలో గత నలభై ఏళ్లుగా యువజనోద్యమంలో ప్రాణత్యాగం చేసి అమరులైన విస్మృత వీరుల చరిత్రను, రాష్ట్ర వ్యాప్తంగా 822 కిలోమీటర్లు మోటారు సైకిల్ యాత్ర చేసిన ఎం. విప్లవకుమార్, ఎ. విజయ్ కుమార్ వెలికితీసి రాసిన పుస్తకం ఆవిష్కరణ ”నెవర్ ఎండ్” జనవరి 5, మధ్యాహ్నం 2 గంటలకు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ప్రజాకవి జయరాజన్న, భూపతి వెంకటేశ్వర్లు, ఎ. నర్సిరెడ్డి, కవి యాకూబ్, చింతల యాదగిరి, పసునూరి రవీందర్, తగుళ్ళ గోపాల్, ఆనగంటి వెంకటేష్, దాసరి యువరాణి, సాత్విక నన్నెబోయిన, నక్క అంజయ్య, జె.కె. శ్రీనివాస్, జి.గంగాధర్ రెడ్డి, భీరెడ్డి సాంబశివ, కోట రమేష్, సుబ్బు ఆర్వీ, ఈసంపల్లి బాబు, అనంతోజు మోహన కృష్ణ, నూకల అశోక్, బొంత వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొంటారు. – ఎ. విజయ్ కుమార్
‘మాయని గాయాల నెత్తుటి చరిత్ర’ పుస్తకావిష్కరణ
సీనియర్ జర్నలిస్టు మంగళారపు లక్ష్మణ్ రచించిన ‘మాయని గాయాల నెత్తుటి చరిత్ర’ (యదార్థ సంఘటనల సమాహారం) పుస్తకావిష్కరణ జనవరి 6 న సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్, రవీంద్ర భారతి మినీహాల్‌లో జరుగుతుంది. సభాధ్యక్షులుగా అన్నవరం దేవేందర్ వ్యవహరిస్తారు. ఆచార్య ఘంటా చక్రపాణి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ముఖ్య అతిథిగా వి. ప్రకాష్, గౌరవ అతిథిగా నారదాసు లక్ష్మణ్ రావు, ఆత్మీయ అతిథిగా ఎస్కే జకీర్ పాల్గొంటారు. డా. వెల్దండి శ్రీధర్ పుస్తక పరిచయం చేస్తారు.
-సాహితీ సోపతి
”కవిత్వ సౌరభం” కవి సమ్మేళనం
జనవరి 1 2024 మధ్యాహ్నం రెండు గంటలకు రవీంద్ర భారతి మినీ హాల్లో తెలంగాణ సాహితీ సమాఖ్య నిర్వహణలో ”కవిత్వ సౌరభం” శీర్షిక కింద కవి సమ్మేళనం జరగనుంది. 20 మంది ప్రముఖ కవులు పాల్గొంటున్న ఈ కవి సమ్మేళనంలో అతిథులుగా దేశపతి శ్రీనివాస్ ,కొప్పర్తి ,ఏనుగు నరసింహారెడ్డి, కాంచనపల్లి గోవర్ధన్ రాజు, వజ్జల శివకుమార్ పాల్గొంటారు. సాహిత్య అభిమానులంతా ఈ సదస్సుకు హాజరు కావలసిందిగా ఆహ్వానిస్తున్నాం.
– వేముగంటి మురళీకష్ణ, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
ఎదిరెపల్లి మశమ్మ స్మారక పురస్కారం
ప్రతి ఏటా అందచేస్తున్న ఎదిరెపల్లి మశమ్మ స్మారక పురస్కారానికి ప్రముఖ కవయిత్రి డా. వినోదిని మాదాసు యోగివేమన విశ్వవిద్యాలయం ఎంపికైనారని తెలిపారు. ఈ నెల 31 ఉదయం 10గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సింగిల్ విండో హల్ లో జరిగే ఈ సభకు డా||చింతకింది కాసీం హజరవుతారు. ఈ పురస్కారం కింద రూ/- 20 వేలు నగదు, జ్ఞాపికను అందచేస్తారు. – ఎదిరెపల్లి కాశన్న
ఈ నెల 5న రెండు పుస్తకాల ఆవిష్కరణ
తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్, తెలంగాణ సాహితి సంయుక్త ఆధ్వర్యంలో ‘రేపెక్కడికెళ్తావ్!’ (భారతీయ అనువాద కథల సంపుటి, రచయిత: డా.రూప్‌కుమార్ డబ్బీకార్), మాటలో మనసునై (వ్యాస సంపుటి, రచయిత: కె. ఆనందాచారి) ఆవిష్కరణ సభ జనవరి 5, 2024 సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి మినీహాల్‌లో జరుగుతుంది. ఈ సభలో డా|| ఎస్. రఘు, ప్రొ|| సూర్యా ధనుంజయ్, శ్రీ సుధా భాస్కర్, డా|| ఏనుగు నరసింహారెడ్డి, డా|| మామిడి హరికష్ణ, చింతపట్ల సుదర్శన్, కవి యాకూబ్, సి.ఎస్. రాంబాబు, తంగిరాల చక్రవర్తి, ఆర్. వాసు, అనంతోజు మోహన్ కష్ణ పాల్గొంటారు.