‘విభజిత’ ఆవిష్కరణ
విజయ భండారు కథా సంపుటి ‘విభజిత’ ఆవిష్కరణ సభ ఈ నెల 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫెరెన్స్ హాల్లో జరుగుతుంది. ఈ సభకు ఓల్గా, శీలా సుభద్రాదేవి, డా||మామిడి హరికృష్ణ, వి.సంధ్య, మానస ఎండ్లూరి, డా||నందిగాం నిర్మల, భండారు విజయ పాల్గొంటారు.
పిల్లల కోసం సైన్స్ ఫిక్షన్ కథలు, నవలల పోటీ!
లీలావతి దనే – సైన్స్ ఫిక్షన్ కథల పోటీ, విఠాల లలిత కౌమార బాలల సైన్స్ ఫిక్షన్ నవలల పోటీ నిర్వహిస్తున్నారు. కథల పోటీలో 18 ఏళ్ళ లోపు వారు పాఠశాల/ కళాశాల ప్రిన్సిపాల్ దృకరణ పత్రం జతచేసి రెండు కథలకు మించకుండా పంపాలి. విఠాల లలిత కౌమార బాలల సైన్స్ ఫిక్షన్ నవలల పోటీకి పిల్లలూ, పెద్దలూ ఆసక్తిగా చదివేలా వుండే నవలలను ఏ 4 సైజులో టైపులో 50- 60 పేజీలకు మించకుండా ఏ వయసు వారైనా రాయొచ్చు. కథల పోటీలో మొదటి రెండు బహుమతులు వరుసగా 2500/-, 2000/-, మరో మూడు ప్రత్యేక బహుమతులుంటాయి. నవలల పోటీలో మొదటి రెండు బహుమతులు వరుసగా 5000/-, 3000/-, మరో రెండు ప్రత్యేక బహుమతులుంటాయి. కథలను జనవరి 26 లోపు, నవలలను ఫిబ్రవరి 10, 2024 లోపు డా|| వి.ఆర్.శర్మ, 304, ఎండికోస్ కౌంటి అపార్ట్మెంట్, జెక్ కాలని, వీధి నెంబీ 2, సనత్ నగర్ – 500018 చిరునామాకు పోస్ట్/ కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి. వివరాలకు: వి.ఆర్. శర్మ,- 9177887749, గరిపెల్లి అశోక్- 984964 9101
పాలమూరు సాహితి అవార్డు – 2023కు కవితా సంపుటాల ఆహ్వానం
ఈ సంవత్సరం పాలమూరు సాహితి అవార్డు పురస్కారం కోసం 2023 సంవత్సరంలో ముద్రితమైన వచన కవితా సంపుటాలను మూడేసి ప్రతులను పంపించాల్సిందిగా కోరుతున్నారు. కవులు తమ ప్రతులను డా|| భీంపల్లి శ్రీకాంత్, ఇ.నం. 8-5-38, టీచర్స్ కాలని, మహబూబ్ నగర్ – 509001, తెలంగాణ చిరునామాకు జనవరి 31 లోపున పంపాలి. బహుమతి పొందిన ఉత్తమ వచన కవితా సంపుటికి రూ.5,116/- నగదు, జ్ఞాపికను అందజేస్తారు. – డా|| భీంపల్లి శ్రీకాంత్, 9032844017
ఉగాది కవితలపోటీ
శ్రీకార్తీక డెవలపర్స్, సాహితీకిరణం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర జాతీయ స్థాయి ఉగాది కవితలపోటీలు. మొదటి మూడు బహుమతులు వరుసగా 2500/-, 2000/-, 1500/-, రెండు ప్రత్యేక బహుమతులు (ఒక్కొక్కటి రూ||1000/-). కవిత 20 – 30 లైన్లకు మించరాదు. ఫిబ్రవరి 29 లోపు ఎడిటర్, సాహితీకిరణం, ఇం.నెం.11-13-154, అలకాపురి, రోడ్‌నెం.3,హైదరాబాద్- 500102 చిరునామాకు పంపాలి. వివరాలకు : 94907 51681