కుడికాల వంశీధర్ ‘లోపలి వాన’ ఆవిష్కరణ
కుడికాల వంశీధర్ రచించిన ‘లోపలి వాన’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఈ నెల 29న ఉదయం 10 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరం (మొదటి అంతస్తు), హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ సభకు డా. ఎన్.గోపి ఆచార్య సూర్యా ధనుంజరు, డా. ఎస్. రఘు, డా. గిన్నారపు ఆది నారాయణ మద్దాళి రఘురాం హాజరవుతారు.
– మద్దాళి రఘురాం, కుడికాల వంశీధర్
బాలల సాంస్కతికోత్సవం
తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహించే సాంస్కృతికోత్సవం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు, సృజనాత్మక రచన అధ్యయన శిబిరాలు జరుగుతాయి. వివిధ రంగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అద్భుతాలు సష్టించి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న బాల మేధావులు తమ అనుభవాలు పంచుకుని తోటి విద్యార్థులకు ప్రేరణ కలిగిస్తారు. రెండు రకాలుగా నిర్వహించే మొదటి పోటీలో విద్యార్థులు రెండు పేజీలకు మించకుండా కథ, 20 పంక్తులకు మించకుండా ఏదేని అంశంపై వచన కవిత, ఐదు పద్యాలకు మించకుండా పద్య కవితా పోటీకి రాసి పంపాలి. చిత్రలేఖనం గీసి పంపవచ్చు. చిరునామా: తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్ రోడ్డు, ఆబిడ్స్, హైదరాబాద్. రెండోది ఉత్సవం రోజున కూడా అప్పటికప్పుడు ఏకపాత్రాభినయ పోటీ, దేశభక్తి, లలిత గీతాలాపన పోటీ,వ్యాసరచన, వక్తత్వం, పుస్తక సమీక్ష పోటీలు ఉంటాయి.విద్యార్థులు 9603727234 నెంబర్‌కు తమ పేరు, తరగతి, పాఠశాల, ఊరి పేరు ఇతర వివరాలను పంపాలి. ప్రతినిధులుగా పాల్గొనేవారు, పోటీల్లో పాల్గొనేవారు అక్టోబర్ 10వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి.
– డాక్టర్ జె. చెన్నయ్య