సాహితీ వార్త‌లు

‘పునాస’ కు రచనలు ఆహ్వానం
తెలంగాణ సాహిత్య అకాడమి వెలువరించే ‘పునాస’ సాహిత్య త్రైమాసిక పత్రికకు యువ కళాకారుల నుండి సాహితీ వ్యాసాలు, కథలు (అనువాదాలు కూడా), కవితలు (అనువాదాలు కూడా) ఆహ్వానిస్తున్నది. చివరితేదీ 15. చిరునామా:ఎడిటర్‌, పునాస, సాహిత్య త్రైమాసిక పత్రిక, తెలంగాణ సాహిత్య అకాడమి, కళాభవన్‌, రవీంద్రభారతి, హైదరాబాద్‌. email: editor.punasa@gmail.com. . 9989260336.
– డా.ఎన్‌.బాలాచారి,
కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమి
‘అసిపె’ పరిచయ సభ

తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ నెలపొడుపు సాహిత్య సాంస్కతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో వనపట్ల సుబ్బయ్య ‘అసిపె’ దీర్ఘకావ్యం పరిచయ సభ డిసెంబర్‌ 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరుగుతుంది. ఈ సభలో పి.వహీద్‌ ఖాన్‌, గోరటి వెంకన్న, జూలూరు గౌరిశంకర్‌, గుంటూరు లక్ష్మీ నరసయ్య, ఎస్‌. రఘు, యాకూబ్‌, సంగిశెట్టిశ్రీనివాస్‌, సీతారాం, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, ఉప్పల బాలరాజు, నాగవరం బాల్‌ రాం, కోడెపాక కుమారస్వామి, సూర్యపల్లి శ్రీనివాస్‌, నారు, కందికొండ మోహన్‌ తదితరులు పాల్గొంటారు.
-వనపట్ల సుబ్బయ్య, 9492765358
తెలంగాణ రచయితల సంఘం ఆహ్వానం
తెలంగాణ అస్తిత్వ సాహిత్యం – వర్తమాన సందర్భం, తెలంగాణ రచయితల సంఘం పదేండ్ల సాహిత్య సభలు ఈ నెల 8వ తేదీ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 7.30 వరకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. ఈ సభకు డా. నాళేశ్వరం శంకరం, పరాంకుశం వేణుగోపాల స్వామి, డా.నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, ఆచార్య సూర్యా ధనుంజరు, డా.ఏనుగు నరసింహారెడ్డి, డా.మామిడి హరికృష్ణ, కందుకూరి శ్రీరాములు, డా.వి. శంకర్‌, ఘనపురం దేవేందర్‌, కొత్త అనిల్‌ కుమార్‌, పొట్లపల్లి శ్రీనివాస రావు, ఆచార్య సి. కాశీం, కొల్లాపురం విమల, ఆచార్యబాణాల భుజంగరెడ్డి, బెల్లంకొండ సంపత్‌ కుమార్‌, డా.పొన్నాల బాలయ్య, తదితరులు హాజరవుతారు. ఇదే సభలో ఇల్లు (కవితా సంకలనం- సంపాదకత్వం: కీ. శే.జంగ వీరయ్య – వీత్రీజ), నిశిత (డా.వి.శంకర్‌ సాహిత్య వ్యాసాలు), పచ్చబొట్టు (కవితా సంపుటి) పుస్తకావిష్కరణలు వుంటాయి.