స్తంభించిన ఖాతాలకు రుణమాఫీ

Loan waiver for frozen accounts– ఆందోళన వద్దు : రైతులకు మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
స్తంభించిన రైతుల బ్యాంకు ఖాతాలకు కూడా రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. రైతులు ఆందోళన చెందవద్దని ఈమేరకు శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 2018 డిసెంబర్‌ 11 నాటికి ప్రతి కుటుంబానికి రూ.లక్ష వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం 16,65,656 మంది రైతుల ఖాతాలకు రూ.8089.74 కోట్లను విడుదల చేసిందని తెలిపారు. బ్యాంకుల విలీన ప్రక్రియ మూలంగా ఈ విషయంలో రైతుల ఖాతాల వివరాలు మారడం లేదని తెలిపారు.