కొనసాగుతున్న లక్షలోపు రుణమాఫీ

నవతెలంగాణ -రేవల్లి
రేవల్లి మండల కేంద్రంలో యూనియన్ బ్యాంక్ దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి లక్షలోపు రుణమాఫీ ఇంకా కొనసాగుతూనే ఉంది. రేవల్లి మండల కేంద్రంలోనీ రుణ గ్రహీతలందరూ ముకుమ్మడిగా ఒకేసారి బ్యాంకు వద్దకు చేరుకోగానే ఒకింత తొక్కిసలాట తోపులాట జరిగింది. ఇందుకుగాను రేవల్లి ఆంధ్ర బ్యాంకు మేనేజర్, స్థానిక ఎస్సై శివకుమార్ గారి సహకారంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి రుణమాఫీ కార్యక్రమాన్ని సజావుగా సాగే విధంగా కొనసాగిస్తున్నారు. ఈ రుణమాఫీ కార్యక్రమం మొదలుపెట్టి వారం రోజులు కావస్తున్న రైతులు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. అంటే ఇంకా పూర్తవలేదని అర్థం అవుతుంది. కొందరు గ్రహీతలు వచ్చి రోజంతా గంటలు తరబడి నిలబడ్డా కూడా వారికి సంబంధించిన రుణమాఫీ కాలేదని అసహనంగా వెను జరుగుతూ ఉంటే చూసిన స్థానికులు వారిపై జాలి చూపడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి. ఈ రుణమాఫీ కార్యక్రమం ఏ ఎప్పటి వరకు పూర్తవుతుందో వేచి చూడాల్సిందే.