— పెండింగ్ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలి
ప్రిన్సిపాల్ జిల్లా జడ్జి కె.సుదర్శన్
నవతెలంగాణ వికారాబాద్ కలెక్టరేట్
ఈనెల 10న నిర్వహించే నేషనల్ లోకాదా లత్‌లో వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసులు, మోటార్ ఆక్సిడెంట్ నష్ట పరిహా రం కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కారానికి కృషి చేయాలని ప్రిన్సిపాల్ జిల్లా జడ్జి కే.సుదర్శన్ అన్నారు. శుక్రవారం బార్ అసోసియేషన్ హాల్ లో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, వికారా బాద్ న్యాయవాదులతో ఏర్పాటు చేసిన సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాద బీమా కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కారానికి ఇన్సూరెన్స్ కంపెనీ ప్యానెల్ న్యాయవాదులు కృషి చేయాలని కోరా రు. ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి సిహెచ్ చంద్రకిషోర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శృతిదూత, బార్ అసోసియేషన్ అధ్య క్షులు జనర్దన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాదులు జగన్, న్యాయవాదుల పాల్గొన్నారు.