బోలెడు పోషకాలు

Lots of nutrientsభూమి లోపల కాసే వేర్ల దుంపలు, కూరగాయలు మనకు ఎన్నో పోషకాలను అందిస్తాయి. అందుకే వాటిని మనం నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. మరి అలాంటి కూరగాయలేవో, వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

 ఉల్లిగడ్డలో ఫైబర్‌, విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
మోరం గడ్డలో ఫైబర్‌, విటమిన్‌ సి, మాంగనీస్‌, విటమిన్‌ ఏ పుష్కలంగా ఉంటాయి. ఈ దుంపలు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. బీటా కెరోటిన్‌, క్లోరోజెనిక్‌ యాసిడ్‌, ఆంథోసైనిన్‌ కలిగి ఉంటాయి. ఇవన్నీ శరీరానికి చాలా ఉపయోగకరమైనవి.
అల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇందులో ఒక నిర్దిష్ట పోషకాల సమ్మేళనం ఉంటుంది. ఇది మంచి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. గొంతు సమస్యలు, జ్వరం ఉన్నవారికి అల్లం మేలు చేస్తుంది.
బీట్‌రూట్‌లో ఫైబర్‌, ఫోలేట్‌, మాంగనీస్‌ ఉంటాయి. ఇది శరీరానికి చాలా మేలు చేసే పోషకాలతో కూడిన కూరగాయ. బాడీలో రక్తం తక్కువగా ఉన్న వారు బీట్‌రూట్‌ వాడాలని డాక్టర్లు చెబుతుంటారు.
వెల్లుల్లిలో మాంగనీస్‌, విటమిన్‌ బి6, విటమిన్‌ సి వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. వెల్లుల్లి రోజూ వాడటం ఆరోగ్యకరం. ఇది గుండెకు మేలు చేస్తుంది.
ముల్లంగిలో కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్‌, విటమిన్‌ సి కూడా పుష్కలంగా ఉంటాయి.
క్యారెట్‌లో విటమిన్‌ ఏ ఉంటుంది. ఇది కంటికి చాలా మంచిది. ఇందులో విటమిన్‌ కె అనే యాంటీ ఆక్సిడెంట్‌ కూడా ఉంటుంది. ఇది జుట్టుకు చాలా మంచిది. క్యారెట్‌ బీటా కెరోటిన్‌ కూడా కలిగి ఉంటుంది.