నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ (యూఐటీపీ) అవార్డులు-2023 కోసం స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఈనెల 4 నుంచి 7వరకు యూఐటీపీ గ్లోబల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎలివేటింగ్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ హైదరాబాద్, ఇండియాపై సమర్పించిన నామినేషన్ ఫైనలిస్ట్‌లలో ఒకటిగా ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్) ఎంపికైంది. మల్టీమోడల్ ఇంటిగ్రేషన్ కేటగిరీ కింద వచ్చిన 500 నామినేషన్‌లలో ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ నామినేషన్ ఫైనలిస్ట్‌లలో ఒకటిగా షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ సీఎండీ కె.వి.బి.రెడ్డి మాట్లాడుతూ.. తమ నామినేషన్ ఫైనలిస్ట్‌లలో ఒకటిగా షార్ట్‌లిస్ట్ కావడం గర్వకారణమని తెలిపారు. హైదరాబాద్‌కు, ప్రయాణీకులకు పర్యావరణ అనుకూలమైన రవాణాను అందించడంలో తమ ప్రయత్నాలను గుర్తించినందుకు అసోసియేషన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణీకుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. సురక్షితమైన, సమర్థవంతమైన రవాణా పరిష్కారాలను అందించడానికి అంకితం చేయడం జరిగిందన్నారు.