మధ్యాహ్న భోజనం వర్కర్ల వంటావార్పు

నవతెలంగాణ-కొణిజర్ల
రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా మధ్యాహ్నం భోజనం వర్కర్లు ఆదివారం కొణిజర్ల మండల కేంద్రంలో 11 రోజు వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన మధ్యాహ్నం భోజనం వర్కర్లు ప్రభుత్వ పాఠశాలలో అప్పులు చేసి భోజనాలు వండి పెడుతున్నారని, కానీ వారికి ఇచ్చే పారితోషికాలు దేనికి సరిపోవు అన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పిన ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలు ఎండను సైతం లెక్కచేయకుండా టెంట్ల కింద దీక్షలు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మధ్యాహ్నం భోజనం వర్కర్లకు ప్రకటించిన 3000 పారితోషకం వెంటనే విడుదల చేయాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని ఆరోగ్య బీమా కల్పించాలని నాణ్యమైన యూనిఫామ్‌ అందించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అనుమోలు రామారావు, అన్నారపు వెంకటేశ్వర్లు, మధ్యాహ్న భోజన వర్కర్లు పద్మ, తిరుపతమ్మ,, మరియమ్మ,సత్యవతి,సైదమ్మ, గంగ, జీజ,వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు