నవతెలంగాణ-ఇల్లందు
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గత 11 రోజులుగా ఇల్లందు ఎంపీడీవో ఆఫీస్ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో టెంట్ వేసుకొని నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె శిబిరం ముందు శిలాఫలాన్ని ఆవిష్కరణకు వచ్చిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌కు తమ సమస్యకు పరిష్కారం చూపమని కారు వద్దకు వెళ్లి అడుగగా సమ్మె శిబిరం వద్దకు వచ్చారు. మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుల్తానా మండల అద్యక్ష కార్యదర్శులు కోశాధికారి తురక సావిత్రి, కుమారి, పార్శిక స్వరూప లనుండి వినతి పత్రాన్ని స్వీకరించారు. అనంతరం సుల్తాన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాము ప్రభుత్వ బడి పిల్లలకు వండి పెడుతుంటే ప్రభుత్వం మాకు నెలకు వెయ్యి రూపాయల వేతనంతో సరిపెడుతున్నదని, అంతే గాక పిల్లలకు రాగి జావ, అల్పాహారం తయారు చేసి పెట్టమంటున్నదని వెయ్యి రూపాయల వేతనంతో ఎలా కుటుంబాన్ని గడపాలని కార్మికులు ఎమ్మెల్యే ముందు వాపోయారు. ఈ నిరవధిక సమ్మె శిబిరాన్ని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పద్మ లక్ష్మి, సరోజ సోమక్క జయ కౌసల్య సైదమ్మ, కేతమ్మ, బుచ్చమ్మ, జ్యోతి, అనసూర్య, రాణి, పార్వతి, పద్మ, శాంతి తదితరులు పాల్గొన్నారు.