నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లిలో బుధవారం సీపీఐ(ఎం) నియోజకవర్గస్థాయి సమావేశం జరగనుంది. సత్తుపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా మాచర్ల భారతి నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు నియోజకవర్గ సీపీఐ(ఎం) నాయకులు తెలిపారు. సిద్దారం రోడ్డులోని లక్ష్మీప్రసన్న ఫంక్షన్‌హాలులో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు బుగ్గవీటి సరళ, రాష్ట్ర నాయకులు మన్నేపల్లి సుబ్బారావు, జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేశ్, సీనియర్ నాయకులు తాతా భాస్కరరావు, జిల్లా నాయకులు జాజిరి శ్రీనివాస్, చలమాల విఠల్‌రావు, సీనియర్ నాయకులు శీలం సత్యనారాయణరెడ్డి, తల్లాడ మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వరరావు, సత్తుపల్లి పట్టణ కార్యదర్శి రావుల రాజబాబు, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు మండలాల కార్యదర్శులు అర్వపల్లి జగన్మోహనరావు, గాయం తిరుపతిరావు, మాదాల వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు తన్నీరు కృష్ణార్జునరావు పాల్గొంటారని సీపీఐ(ఎం) నాయకులు తెలిపారు.