– యూఎస్పిఎస్ జిల్లా స్టీరింగ్ కమిటీ పిలుపు
నవతెలంగాణ- కంటేశ్వర్
సెప్టెంబర్ ఒకటవ తేదీన మహా ధర్నాను విజయవంతం చేయాలని యూఎస్పిఎస్సి జిల్లా స్టీరింగ్ కమిటీ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యూఎస్పిసి రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఉద్యమ పిలుపులో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్లో ఇంద్ర పార్క్ వద్ద చేపట్టనున్న మా ధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు జిల్లా స్టీరింగ్ కమిటీ పక్షాన బుధవారం విజ్ఞప్తి చేస్తున్నామని జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బాలయ్య సత్యనారాయణ సురేష , సుధా, రాజన్న, రమేష్, భోజన్న ప్రకటనలో తెలియజేశారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఫలితంగా ప్రభుత్వ విద్య నిర్లక్ష్యానికి గురై రోజురోజుకు నిర్వీర్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 22 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా స్వయంగా ముఖ్యమంత్రి శాసనసభలో 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేడు 5 వేల 89 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించడం నిరుద్యోగ ఉపాధ్యాయులను మోసగించడమే అవుతుంది. తొమ్మిదేళ్లుగా పదోన్నతులు నిర్వహించక ఐదేళ్లుగా బదిలీలు చేపట్టక, ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన 5571 ప్రధానోపాధ్యాయుల పోస్టులకు ఉత్తర్వులు వెలువరించకపోవడం, పండిట్, పీఈటీల అప్ గ్రే డేషన్ ఉత్తర్వులు ఇవ్వకపోవడం, వంటి కారణాలతో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ విద్యా రంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించాలని, గత జులై 31 తో పిఆర్సి గడువు ముగిసినందున వెంటనే పిఆర్సి కమిషన్ నియమించి తాత్కాలిక భృతి 20% ప్రకటించాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపు తక్షణమే చేపట్టాలని, సర్వ శిక్ష అభియాన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులoదరిని రెగ్యులర్ చేయాలని, మొదలైన డిమాండ్లతో మహాధర్నా చేపట్టనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలియజేశారు.