9,10 తేదీల్లో మహాపడావ్‌

Mahapadav in dates – కార్మికులంతా జయప్రదం చేయాలి : ఏఐటీయూసీ
నవెతలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తునన ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9,10 తేదీల్లో తలపెట్టిన మహాపడావ్‌ను కార్మికులంతా జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాల్‌రాజ్‌ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో మహాపడావ్‌ కార్యక్రమం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 29 కార్మిక చట్టాలను సమూలంగా మార్చేసి లేబర్‌ కోడ్‌లను పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌లకు బంగారు పళ్ళెంలో అందించటాన్ని వ్యతిరేకించారు. పంటకు గిట్టుబాటు ధర, రైతు బీమా, రుణమాఫీ లాంటి డిమాండ్లతో రైతులు ఢిల్లీలో పోరాటం చేసిన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌డీ.యూసుఫ్‌, ఉప ప్రధాన కార్యదర్శి యం.నర్సింహ్మా, ఉపాధ్యక్షులు బి.చంద్రయ్య, కె.ఏసురత్నం, పి.ప్రేంపావని, కార్యదర్శులు ఎస్‌.విలాస్‌, బి.వెంకటేశం, శింగు నర్సింహ్మా రావు, ఓరుగంటి యాదయ్య, పల్లా దేవేందర్‌ రెడ్డి, యం.డి.ఇమ్రాన్‌, వేకల శ్రీనివాస్‌, నరాటి ప్రసాద్‌, ఎన్‌.కరుణ కుమారి, సీనియర్‌ నాయకులు ఉజ్జిని రత్నాకర్‌రావు పాల్గొన్నారు.