చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి మహర్ధశ

– ఎమ్మెల్యే కాలెయాదయ్య
-నూతన ఫర్నిచర్‌ ఏర్పాటుకు
– రూ.17.50 కోట్లు మంజూరు
– వైద్యులు, సిబ్బంది కలిసి ఎమ్మెల్యేకు సన్మానం
నవతెలంగాణ-చేవెళ్ల
చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి మహర్దశ పట్టనుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది కలిసి ఎమ్మెల్యే కాలె యాదయ్యను సన్మానించారు. చేవెళ్ల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ 50 పడకల నుంచి 100 పడకలకు పెంపు చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సోమ శేఖర్‌, సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ లక్ష్మికాంత్‌రెడ్డి, వైద్య సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే కాలె యాదయ్యను మర్యాద పూర్వకంగా కలిశారు. పూలమొక్క, శాలువతో సత్కరించి, స్వీట్లు తినిపించారు. ఆస్పత్రికి అభివృద్ధి పనులపై కొద్దిసేపు చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి అధునాతన నూతన భవనం, వైద్య పరికరాలు, నూతన ఫర్నిచర్‌ నిమిత్తం రూ.17.50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ప్రస్తుతం ఆస్ప త్రి ఆవరణ లోనైన, లేదా చేవెళ్లలోనే ఇతర ప్రదేశంలో నూతన భవనం నిర్మాణానికి విధంగా చూస్తానని వెల్ల డించారు. వైద్యులు అకింత భావంతో పనిచేయాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో మర్యాద పూర్వ కంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. గర్భిణులకు మెరు గైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.ఆస్పత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వివరించారు.