– మండల కాంగ్రెస్ అధ్యక్షులు డోకుర్ ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ-తలకొండపల్లి
కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు డోకుర్ ప్రభా కర్ రెడ్డి అన్నారు. మండలంలోని విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు 2 తేదీన జూన్ శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వెంకటా పూర్ (పడకల్) గేటు నుండి తలకొండపల్లి మండల కేంద్రం వరకు భారీగా బైక్ ర్యాలీ ఉంటుందని అందరూ పాల్గొనాలని తెలిపారు. కార్యక్రమంలో మండల కాం గ్రెస్ అధ్యక్షులు డోకుర్ ప్రభాకర్ రెడ్డి, టీపీసీసీ కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాములు, వెంకటేష్, సర్పంచ్ శ్రీశైలం, డీసీసీ కార్యదర్శి రవీందర్ యాదవ్, అసెంబ్లీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ అజీమ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, కిసా న్ కాంగ్రెస్ అధ్యక్షులు విష్ణు, మైనార్టీ మండలా ధ్యక్షులు ఆరిఫ్, ఎంఎస్‌యుఐ మండల అధ్యక్షులు రమేష్, మాజీ ఉపసర్పంచ్ చెన్నకేశవులు, సీనియర్ కాంగ్రెస్ నాయకు లు తిరుపతి రెడ్డి, జంగిలి చంద్రారెడ్డి, వార్డు మెంబర్ శ్రీను నాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు విష్ణు తదితరులు పాల్గొన్నారు.