డీడీఎఫ్ రాజాతోత్సవ మహాసభలను జయప్రదం చేయండి

– డీడీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శంతన్

నవతెలంగాణ – కంటేశ్వర్
గత రెండున్నర దశాబ్దాలుగా విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం కృషి చేస్తున్న డి టిఎఫ్ రజోత్సవ మహాసభలు వచ్చే అక్టోబర్ మాసంలో మహబూబ్ నగర్ కేంద్రంగా జరుగుతున్నాయని వాటిని జయప్రదం చేయాలని డిటి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. శంతన్ ఉపాధ్యాయులను కోరారు. డిటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదురుగా మహాసభల ఆహ్వాన కమిటీ పత్రాలను నేటి సాయంత్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా శంతన్, జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్య లు మాట్లాడుతూ..డిటిఎఫ్ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తయి 25వ వసంతంలోకి అడిగిడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న మహాసభల్లో విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలు, సామాజిక అంశాలపై చర్చ, ఉంటుందని, కావున మహాసభలను జయప్రదం చేయడానికి ఉపాధ్యాయులు సహకరించాలని, అధిక సంఖ్యలో హాజరు అవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విద్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రoగా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆ కారణంగా సమాజంలోని పేద వర్గాల బిడ్డలకు నాణ్యమైన విద్య అందకుండా పోతున్నదని తద్వారా సమాజంలో సామాజిక ఆర్థిక అసమానతలు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయన్నారు. కావున విద్యారంగాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్లే విధంగా ఉన్న నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దుచేసి ప్రజలందరికీ సమాన అవకాశాలు గల నాణ్యమైన విద్యను అందించే కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రాజన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులలో 13 శాతం నుండి నేడు ఆరున్నర శాతానికి తగ్గించడం వల్ల, నియామకాలు, పదోన్నతులు కల్పించకపోవడం వల్ల విద్యారంగ పరిస్థితి మరింత సంక్షోభంలోకి ఉరుకుపోయిందని, ఇప్పటికైనా విద్యారంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించి విద్యా రంగ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బాధ్యులు పి. దాసు, రాoదాసు, బాలరాజు, గంగనరసయ్య, షేక్ మదర్, వై.విజయ్ కుమార్, ఎల్ శ్రీధర్, విజయ్ కుమార్, రమేష్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.