ఆగస్టు  4న నిర్వహించే కార్మిక గర్జన ను విజయవంతం చేయండి

– ఐ ఎఫ్ టి యు ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు డి శ్రీనివాసరావు పిలుపు

నవతెలంగాణ-తల్లాడ
ఈ నెల నాలుగున హైదరాబాదులో నిర్వహించే కార్మిక గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐఎఫ్టియు ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు డి శ్రీనివాసరావు, మంగళవారం తల్లాడలో వాల్పోస్టర్ను ఆవిష్కరించి పిలుపునిచ్చారు, ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గాన్ని నిలువు దోపిడీకి గురి చేస్తున్నాయని, విమర్శించారు, తెలంగాణ రాష్ట్రంలో కార్మికులకు కనీస వేతనాలు లేవని ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, కేజీబీవీ మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి బేసిక్ వేతనాన్ని నిర్ణయించి, రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేశారు , హమాలీ మోటర్ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డబ్బులు బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని ,భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ ప్రయోజనాలను పెంచాలని, సహజ మరణానికి గురైన కార్మికుల కు ఐదు లక్షలు ఇవ్వాలని ,ప్రమాద వశాత్తు మృతి చెందితే భవన నిర్మాణ కార్మికుడికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ,పెళ్లి కానుక ప్రసూతి కానుక, లక్ష రూపాయలు చేయాలని డిమాండ్ చేశారు, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4న కార్మిక గర్జన పేరుతో జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు, ఐ ఎఫ్ టి యు ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ లాల్ మియా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని సంఘటిత అసంఘటిత, కార్మికుల హక్కులు వేతనాలు ఇతర సమస్యల సాధనకై భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు కార్మిక గర్జన నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కార్మిక వర్గం ,ి డి రమణ, నాగుల్ మేరా నాగయ్య   గురవయ్య, పెద్దగంటి కృష్ణయ్య, శ్రీను నరేష్ ,రవి, రామకృష్ణ ,రాఘవ, తదితరులు పాల్గొన్నారు.