కాంగ్రెస్ లో పలువురి చేరికలు..

నవతెలంగాణ- డిచ్ పల్లి: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్ పల్లి మండలం లోని కోరట్ పల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి శుక్రవారం నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చేరిన వారిలో చెమ్మట్టి రాకేష్, మర్కంటి శ్రీనివాస్, సూరసాని పండరి, ఎర్రం గంగాధర్, నాయకులు డాక్టర్ జాహుర్, కార్యకర్తలు పాల్గొన్నారు.