– బిఆర్‌ఎస్‌తో పాటు వివిధ పార్టీల నుండి..
– 52వ డివిజన్‌లో 40 కుటుంబాలు
– ఆహ్వానించిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా, అసెంబ్లీ అభ్యర్థి యర్రా శ్రీకాంత్
నవతెలంగాణ-ఖమ్మం
స్థానిక 52వ డివిజన్‌లో ఖమ్మంలో నిత్యం ప్రజా సమస్య లపై పోరాడే సీపీఐ (ఎం) హయంలోనే ఖమ్మంలో ప్రశాంతత, అభివృద్ధి చెందిందని అందుకే పార్టీలోకి బిఆర్‌ఎస్ పార్టీకి, వివిధ పార్టీలకు రాజీనామాలు చేసి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, అసెంబ్లీ అభ్యర్థి యర్రా శ్రీకాంత్ సమక్షంలో 52వ డివిజన్‌లో 40 కుటుంబాలు చేరారు. సీపీఐ(ఎం) పార్టీలోకి 52వ డివిజన్‌లో షేక్.చిన్న హుస్సేన్ నాయకత్వంలో షేక్.నాగుల్ మీరా, కరీమ్, నాగుల్ మీరా, ఖాసిం, నాగుల్ మీరా, సైధా, కరీమ్, చిన్న నాగుల్ మీరా, షేక్.మౌలాలి, షేక్. షఫీ, మహ్మద్. ఖలీల్, శుబాని,చిన్న మైబు, అస్మా,ఖజభి, రిజవాన, మైబు, సన్ని,శుబాను, పెద్ద నాగుల్ మీరా వారి కుటుంబ సభ్యులు అందరు సీపీఎం లో చేరారు. ఈ సందర్బంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, అభ్యర్థి యర్రా. శ్రీకాంత్ లు మాట్లాడుతూ సీపీఎం చేస్తున్న పోరాటాలను చూసి, సీపీఎంతోనే ఖమ్మం అభివృద్ధి చెందిందని నమ్మి పార్టీలో చేరిన వారందరికీ పార్టీ నుండి ధన్యవాదాలు తెలిపారు. సమస్యలకు వలయంగా ఖమ్మం మారిందని, పోరాడే సీపీఎం కే సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ప్రజలు స్వేచ్ఛందంగా ఓటు వేసి గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై. విక్రమ్, జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు, జబ్బార్, నవీన్ రెడ్డి, టూ టౌన్ కార్యదర్శి, బోడపట్ల సుదర్శన్, ఆవాజ్ జిల్లా కార్యదర్శి గౌస్, నాయకులు నర్రా.రమేష్, చింతల. రమేష్, తుడుం.ప్రవీణ్, జే.వెంకన్నబాబు, వీరబాబు, సి.యచ్. భద్రం, షేక్. హుస్సేన్, పకిర్ సాబ్, బి.ముత్తయ్య, వీరప్ప, స్వామి, లక్ష్మయ్య, గుమ్మడి. బిక్షం, నరపోగు. నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.