ముస్లిం మైనారిటీ సంఘం మండలాధ్యక్షుడిగా ఎండీ రషీద్‌..

MD Rashid as Mandal President of Muslim Minority Association..నవతెలంగాణ-హైదరాబాద్‌
వెల్డండ మండల ముస్లిం మైనారిటీ సంఘం మండలాధ్యక్షునిగా మండల కేంద్రానికి చెందిన ఎండీ రషీద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వెల్డండ మండల కేంద్రంలోని మసీదులో శుక్రవారం మండల ముస్లిం సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ముస్లిం మైనారిటీ సంఘం అధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులుగా నిజామోద్దీన్‌ , వర్కి ంగ్‌ ప్రెసిడెంట్‌గా తాజోద్దీన్‌ , ప్రధాన కార్యదర్శి అల్లాజి , కార్యదర్శి అలీ లోద్దీన్‌ , సలదారులుగా , సాధిక్‌ , అలీతో పాటు కార్యవర్గ సభ్యులగా సద్దాం , గఫూర్‌ సబ్‌ , సర్ధార్‌, వాజీర్‌ , జిలానీ , యూసఫ్‌ , అజ్జును ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధగా మండల యువజన కమిటీని కమిటీ అధ్యక్షునిగా లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన జహంగీర్‌ , మన్సూర్‌ , అస్లాం, షకీల్‌ , అఫ్రోజ్‌, దస్తగిరి , ఇమ్రాన్‌, అష్రఫ్‌ , ఉమర్‌ , రషీద్‌, సద్దాం లను కార్య వర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్ష , ఉపాధ్యక్షుల తోపాటు సభ్యులను కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి పూలమాలవేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రషీద్‌ మాట్లాడు తూ..ముస్లిం మైనారిటీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.