పేద ప్రజల ఆరోగ్యం కోసమే వైద్య శిబిరాలు

– జడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్‌
– గుండూరు గ్రామంలో విజయవంతమైన వైద్య శిబిరం
నవతెలంగాణ-ఆమనగల్‌
పేద ప్రజల ఆరోగ్యాన్ని దష్టిలో పెట్టుకొని వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతోనే వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షులు, తలకొండపల్లి మండల జడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్‌ అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని గుండూరులో శుక్రవారం ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తన కుమారుడు డాక్టర్‌ ఉప్పల అఖిల్‌ నేత త్వంలో లయన్స్‌ క్లబ్‌ ఆమనగల్‌, కామినేని ఆస్పత్రి వైద్యుల సహకారంతో నిర్వహించిన వైద్య శిబిరాన్ని స్థానిక నాయకులతో కలిసి ట్రస్ట్‌ చైర్మెన్‌, జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్‌ ప్రారంభిం చారు. వైద్య శిబిరంలో వివిధ రకాల జబ్బులతో బాధపడు తున్న 242 మందికి పరీక్షలు నిర్వహిం చి వారికి కావలసిన మందులు అందజేశారు. సర్పంచ్‌ కష్ణారెడ్డి కోరిక మేరకు గ్రామంలోని అన్ని వీధులలో పర్యటించి ఉండడానికి ఇండ్లు లేక గుడిసెల్లో నివసిస్తున్న కమ్మరి మధు, కొత్తూరు కష్ణయ్య, కల్వకుర్తి కష్ణమ్మ, కల్వకుర్తి అంజయ్య, శాంతమ్మ తదితరుల ఇంటి నిర్మాణానికి తన ట్రస్ట్‌ ద్వారా సహకారం అందజేస్తానని హామీ ఇయ ్యడంతో పాటు ఆయా కుటుం బాల ఇంటి నిర్మాణాలకు స్థానిక నాయకులతో కలిసి ఉప్పల వెంకటేష్‌ శంకుస్థా పన చేశారు. తలకొండపల్లి ఎంపీపీ తిరుమణి నిర్మల శ్రీశై లం గౌడ్‌, ఉపసర్పంచ్‌ లక్ష్మయ్య, నాయకులు శేఖర్‌ రెడ్డి, సురేష్‌, గణేష్‌, రమేష్‌, వెంకటేష్‌ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు.