ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్య ఆరోగ్య దినోత్సవం

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని దశాబ్ది ఉత్సవాలు 2023 లో భాగంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణంలో వైద్య ఆరోగ్య దినోత్సవం బుధవారం కళాశాల ప్రిన్సిపల్ ఇందిరా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి వైద్య ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రతిమ రాజ్, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ సునీల్ కుమార్, ఏడి సుదర్శన్ కుమార్, డాక్టర్ దినేష్, టి ఎన్ జి ఓ ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, గంగాధర్, హనుమాన్లు, చక్రధర్, యు జి, పీజీ విద్యార్థిని విద్యార్థులు మెడికల్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.