మందుబాబులకు అడ్డగా మీసాలతండా ప్రాథమిక పాఠశాల

రాత్రి పూట మందుబాబుల వీరంగం మద్యం సీసాలతో దర్శనమిస్తున్న పాఠశాల పట్టించుకోని గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారులు ఇది భరించలేక వెనుతిరిగి వెళ్లిపోతున్న ఉపాధ్యాయులు అసంఘిత కార్యాకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులపౖౖె కఠిన చర్యలు తీసుకోవాలి : ఉపాధ్యాయులు, విద్యార్థులు
నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలోని కేసీతండా గ్రామ పంచాయతీ అనుబంధమైన మీసాలతండా ప్రాథమిక పాఠశాలలో నిత్యం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. రాత్రి వేళల్లో మందుబాబులు ఎక్కడపడితే అక్కడ ఇస్టానుసారంగా తాగి మద్యం సీసాలను విచ్ఛలవిడిగా వేస్తున్నారు. మందుబాబులకు పలుమార్లు చెబుతున్నా పట్టించు కోకుండా ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై కేసీతండా గ్రామపంచాయతీ పాలకవర్గానికీ, అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదు. ఉదయం పూట విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు రావాలంటేనే జంకుతున్నారు. పాఠశాల ఆవరణంలో మద్యం బాబులు తిన్న తిను బండారాలు, తాగిన మద్యం సీసాలు ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. పాఠశాలలో నిత్యం జరు గుతున్న ఆ సాంఘిక కార్య క్రమాలతో వచ్చే ఉపాధ్యాయులు సెలవులపై వెను తిరిగి వెళ్లిపోవల్సిన పరిస్థితి దాపరిచిందని వారు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే పాలకవర్గం, అధికారులు పాఠశాలలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.