తుక్కుగూడ నుంచి కందుకూరు వరకు మెట్రో రైలు

– హామీని నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌
– మెడికల్‌ కళాశాల మంజూరు
– నిరుపేదలకు ఇండ్ల పట్టాలు
– విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
హైదరాబాద్‌ తుక్కుగూడ మార్గం నుంచి కందుకూరు వరకు మెట్రో రైలు మంజూరు ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకు న్నారనీ, ఆయన కృషితోనే మహే శ్వరం నియోజక వర్గం కందుకూరు మండల ంలో ఎన్నో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించిన క్యాబినెట్‌ సమావేశంలో కందుకూరు వరకూ మెట్రో మంజూరు ప్రకటన చేసిన సందర్భంగా మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మెట్రోతో పాటు మెడికల్‌ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నియోజకవర్గ ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు. కందుకూరు మండల అభివృద్ధి పనుల పురోగతి, నూతనంగా చేపట్టాల్సిన వాటిపై సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులతో కలిసి, మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఎస్‌వైఆర్‌ గార్డెన్‌లో మంగళ వారం సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మం డలంలో కొనసాగు తున్న పనులను యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేయాలని అధికారులను ఆదే శించారు. సీఎం కేసీఆర్‌ పేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలని ఆదేశించారనీ, ఆ మేరకు గ్రామాల్లో ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ స్థలాల్లో పట్టాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. గ్రామాల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు వసతి ఉంటే, జిల్లా గ్రంథాలయ సంస్థ ద్వారా నెలకు రూ.3వేలు మెయింటనెస్‌,10 వేల రూపాయల పుస్తకాలు సరఫరా చేయనున్నట్టు తెలిపారు. ప్రతి పాఠశాలలో రీడింగ్‌ రూమ్‌లు ఉన్నాయని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజా ప్రతి నిధులు చొరవ చూపాలని, పాఠశాలలను సంద ర్శించాలని సూచించారు. బీసీ రుణాలు, గృహలక్ష్మి, దళితబంధు, లాంటి పథకాలు అర్హులైన లబ్ది దారులకు అందేలా చొరవ చూపాలన్నారు. గతంలో ఎన్నాడు లేనివిధంగా అధిక నిధులు తెచ్చి గ్రామాలు అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు వివరించారు. ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఇటీవల మహేశ్వరం పర్యటనలో భాగాంగా ప్రకటించిన గ్రామానికి రూ.15 లక్షల చొప్పున మంజూరు చేసిన నిధులతో ప్రజలకు కనీస సౌకర్యాల కల్పనకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి వివరించి, ఇంకా చేపట్టాల్సిన పనులపై తెలుసు కోవాలని ఆదేశించారు. గ్రామాలు సస్యశ్యామలంగా మారాలని నిరంతరం నిధులు ఇస్తూ, అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నియోజకవర్గం ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుకూర్‌ జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌, పార్టీ అధ్యక్షులు నన్నే జయేందర్‌ ముదిరాజ్‌, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.