మనసుని కదిలించే పాట..

మనసుని కదిలించే పాట..రవికాంత్‌ పేరేపు దర్శకత్వంలో రోషన్‌ కనకాల నటిస్తున్న తొలి చిత్రం ‘బబుల్‌గమ్‌’. ఈ సినిమా ఇప్పటికే హ్యూజ్‌ బజ్‌ని క్రియేట్‌ చేసింది. మేకర్స్‌ ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్‌, పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. శ్రీచరణ్‌ పాకాల ఈ సినిమా కోసం చార్ట్‌ బస్టర్‌ ఆల్బమ్‌ కంపోజ్‌ చేశారు. ఫస్ట్‌ సింగిల్‌ జిలేబి, సెకండ్‌ సింగిల్‌ ఇజ్జత్‌ పాటలు ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో మ్యూజిక్‌ చార్ట్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి.
తాజాగా మేకర్స్‌ ‘బబుల్‌గమ్‌’ థర్డ్‌ సింగిల్‌ అప్దేట్‌ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి మూడో పాట ‘జాను’ని ఈనెల 6న విడుదల చేయనున్నారు. అనౌన్స్‌ మెంట్‌ పోస్టర్‌లో లీడ్‌ పెయిర్‌ కెమిస్ట్రీ చాలా ఎట్రాక్టివ్‌గా ఉంది. ఈ పాట మనసుని కదిలించే మెలోడీగా ఉండబోతుంది.
క్షణం, కష్ణ అండ్‌ హిజ్‌ లీల చిత్రాలతో ఎక్స్‌ట్రార్డినరీ వర్క్‌తో ఆకట్టుకున్న దర్శకుడు రవికాంత్‌ పేరెపు మనసుని హత్తుకునే జెన్జీ ప్రేమకథతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ”బబుల్‌గమ్‌”ను అద్భుతంగా తెరకెక్కించారు. మానస చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం సరికొత్త రొమాంటిక్‌ జర్నీతో ప్రేక్షకులని ఆకట్టుకోనుంది. ప్రతిభావంతులైన తారాగణం, అద్భుతమైన టెక్నికల్‌ టీంతో తెలుగు సినిమా ప్రపంచంలో తప్పక చూడవలసిన చిత్రంగా వుండబోతుంది.
గరుడవేగ, తెల్లవారితే గురువారం, ఆకాశవాణి చిత్రాలకు పనిచేసిన సురేష్‌ రగుతు సినిమాటోగ్రాఫర్‌ కాగా, ‘తల్లుమల’ ఫేమ్‌ కేరళ స్టేట్‌ అవార్డ్‌ విన్నర్‌ నిషాద్‌ యూసుఫ్‌ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 29న విడుదల కానుంది.
‘ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. కంటెంట్‌ బాగున్న సినిమాలను మన తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఆ కోవలో ఉన్న మా చిత్రానికి కూడా మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అని మేకర్స్‌ తెలిపారు.
హర్ష చెముడు, కిరణ్‌ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్‌, అను హాసన్‌, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: రవికాంత్‌ పేరేపు, కథ: రవికాంత్‌ పేరెపు, విష్ణు కొండూరు, సెరి-గన్ని, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: సురేష్‌ రగుతు, ఆర్ట్‌ డైరెక్టర్‌: విఠల్‌ కొసనం, ప్రొడక్షన్‌ డిజైన్‌: శివమ్‌ రావు, స్క్రీన్‌ ప్లే కన్సల్టెంట్‌: వంశీ కష్ణ, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: దివ్య విజరు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మధులిక సంచన లంక.