నేడు జీపీ కార్మికులు, ఉద్యోగ సంఘాల జేఏసీతో మంత్రి ఎర్రబెల్లి చర్చలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మంత్రుల నివాస సముదాయంలో సోమవారం గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ చర్చలు జరుగనున్నట్టు జేఏసీ ప్రకటించింది. సమ్మె యధావిథిగా కొనసాగుతున్నదని స్పష్టం చేసింది. జేఏసీ కార్యాచరణలో భాగంగా సోమవారం రాస్తారోకోలు, ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆదివారం ఈ మేరకు జేఏసీ చైర్మెన్‌ పాలడుగు భాస్కర్‌(సీఐటీయూ), ప్రధాన కార్యదర్శి యజ్ఞనారాయణ (టీజీకేబీయూ), కన్వీనర్లు వెంకటరాజం (ఏఐటీయూసీ), అరుణ్‌ కుమార్‌(ఐఎఫ్‌టీ యూ), శివబాబు(ఐఎఫ్‌టీయూ), ఎన్‌.దాసు(ఐఎఫ్‌టీయూ) ఒక ప్రకటన విడుదల చేశారు.