రైతులకు ధాన్యం డబ్బులు సంపూర్ణంగా బదిలీ : మంత్రి గంగుల కమలాకర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు సంపూర్ణంగా డబ్బులు బదిలీ చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఒక్కరోజే రూ.1,500 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఓపిఎమ్మెస్‌లో నమోదైన వారి ఖాతాల్లోకి రూ.11,444 కోట్లను బదిలీ చేసినట్టు వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11,10,000 మంది రైతుల నుంచి 65.82 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ దాదాపు ముగిసిందనీ, కేవలం 100 కేంద్రాల్లో మాత్రమే కొనుగోలు కొనసాగుతున్నదని పేర్కొన్నారు.